Site icon NTV Telugu

Srinivas Goud : సిగ్గుంటే అలా ప్రచారం చేయరు.. ఫాల్తు రాజకీయం చేస్తున్నారు

Srinivas Goud

Srinivas Goud

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక వేడెక్కుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్‌ మీడియాలో తన పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, “కాంగ్రెస్‌ పార్టీ గెలవలేక తప్పుడు ప్రచారానికి దిగింది. నేను కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌తో ఎప్పుడు ఫోటో దిగానో కూడా నాకు తెలియదు. పాత ఫోటోను పోస్ట్‌ చేసి ‘శ్రీనివాస్‌ గౌడ్‌ నవీన్‌ యాదవ్‌కు మద్దతు’ అని ప్రచారం చేస్తున్నారు. సిగ్గుంటే అలా చేయరని, ఇది ఫాల్తు రాజకీయమని” మండిపడ్డారు.

Khyber Pakhtunkhwa: పాక్ చేతుల్లొంచి జారిపోతున్న ఖైబర్ పఖ్తుంఖ్వా ? .. దాయాది దేశంలో ఏం జరుగుతుంది!

తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో ఈ నకిలీ ప్రచారం చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. “ఆ ఫోటో పెట్టిన వాడెవడో ఫాల్తుగాడు. ఆ వ్యక్తిని బయటకు తీయించి చెప్పుతో కొడతాం. వెంటనే ఆ ప్రచారం ఆపకపోతే వదిలిపెట్టను. మా క్యారెక్టర్‌ను దెబ్బతీయాలన్న ప్రయత్నం అసహ్యం. డీజీపీ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలి,” అని ఆయన హెచ్చరించారు. జనాల్లోకి వెళ్తే ఎంతోమంది అభిమానులు ఫోటోలు దిగుతుంటారని, వాటిలో పాతదేదైనా వాడి తప్పుడు అర్థం కల్పించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. “మా అభ్యర్థి మాగంటి సునీత గెలవడం ఖాయం కాబట్టి కాంగ్రెస్‌ ఇలాంటి అబద్ధపు ప్రచారాలకు దిగింది,” అని వ్యాఖ్యానించారు.

కర్నూలు బస్సు మంటల ఘటనలో అసలు ఏం జరిగిందని వివరించిన ప్రత్యక్ష సాక్షులు…

Exit mobile version