Srinivas Goud Rifle Issue: ఎస్పీ వివరణ.. అందులో బుల్లెట్, పెట్లెట్ ఏదీ లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srinivas Goud Clarity On SLR Gun Fire In Freedom Rally: ఫ్రీడమ్ ర్యాలీలో పోలీసుల తుపాకీతో గాల్లో కాల్పులు జరిపిన వ్యవహారంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ పూర్తి వివరణ ఇచ్చారు. తనకు ఆ రైఫిల్ స్వయంగా ఎస్పీ ఇచ్చారని.. బ్లాంక్ అమ్యూనిషన్‌తో పేల్చామని తెలిపారు. కేవలం శబ్దం కోసమే తుపాకీ కాల్చామని.. అందులో బుల్లెట్, పెట్లెట్ లేదని మహబూబ్‌నగర్ ఎస్పీ వివరణ ఇచ్చారని అన్నారు. ర్యాలీని, అందుకు వచ్చిన జనాన్ని చూపించకుండా.. కేవలం తుపాకీ కాల్చడాన్నే చూపించడం బాధాకరమన్నారు. రాజకీయంగా గిట్టలేకే కొంతమంది చీప్ ట్రిక్స్‌తో పబ్లిక్‌ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఎవడో పడని వాడు, గిట్టని వాడు చేయిస్తే.. వెరిఫై చేయకుండా జాతీయ స్థాయిలో ఈ విషయాన్ని తీసుకెళ్లడం బాధాకరమన్నారు.
తమకున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేకే కొందరు ఇలా చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలనుకోవడం మంచిది కాదన్నారు. అయినా.. ఎవరైనా ఎస్ఎల్ఆర్ తుపాకీని తీసుకుంటారా? అంటూ తిరిగి ప్రశ్నించారు. స్పోర్ట్స్ ఈవెంట్లో స్పోర్ట్స్ మినిస్టర్‌గా చేయమంటే చేశానని, ఇందులో ఏమీ లేదని చెప్పారు. ఆల్ ఇండియా రైఫిల్ అసోసియేషన్‌లో తానో మెంబర్‌నని, తనకు అన్ని రూల్స్ తెలుసని అన్నారు. తాను తెలంగాణ కోసం జైలుకు పోవడంతో పాటు ఆఫీసర్‌గా కేసులు కూడా ఎదుర్కొన్నానన్నారు. సీఎం కేసీఆర్ పిలుపుతో వజ్రోత్సవాలు జరుపుకుంటున్నామని, తాము స్పోర్ట్స్ ఈవెంట్‌కి వెళ్లినప్పుడు గాల్లో ఫైర్ చేస్తామని అన్నారు. ఫ్రీడమ్ రన్ చేయాలని పోలీసు శాఖను ప్రభుత్వం ఆదేశించిందని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
- Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
- ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
తాజావార్తలు
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!