Site icon NTV Telugu

Srinivas Goud : కేంద్రంలో క్రీడా పాలసీ తీసుకురావాలి

Telangana Sports Minister Srinivas Goud About Stadiums.

వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలపై దృష్టి పెట్టాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ప్రతి నియోజకవర్గానికి తెలంగాణ ప్రభుత్వం స్టేడియం మంజూరు చేసిందని, ఇప్పటికే 40 స్టేడియాలు నిర్మాణ దశలో ఉన్నాయని ఆయన వెల్లడించాఉ. నిపుణులైన క్రీడాకారుల సలహాలు తీసుకొని క్రీడా పాలసీ తీసుకొస్తామని, రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితి అద్వాన్నంగా ఉండేదని ఆయన తెలిపారు. ఇపుడు ఏదో ఒక స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహిస్తున్నామని, 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం చిన్న మెడల్స్ తో సరిపెట్టుకుంటున్నామని, కేంద్రంలో క్రీడా పాలసీ తీసుకురావాలని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రతి స్కూల్ లో గ్రౌండ్ ఉండాలని పాలసీలో మెన్షన్ చేస్తున్నామని, రాబోయే రోజుల్లో గ్రామీణ, మండల, జిల్లా, రాష్ర్టంలో సీఎం కప్ పేరునా పోటీలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ తరహాలో వరంగల్ ను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారన్నారు. ప్రపంచంలో తెలంగాణకు ఎలా గుర్తింపు తేవాలని నిరంతరం ఆలోచన చేస్తాడని, 2014 ముందు రాష్ట్రం ఎలా ఉంది. ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు చూస్తున్నారన్నారు. గచ్చిబౌలితో పాటు వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ లో మెగా ఈవెంట్స్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

https://ntvtelugu.com/jagadish-reddy-fired-on-bjp/
Exit mobile version