Site icon NTV Telugu

Sridhar Babu : HILT పాలసీపై శ్రీధర్ బాబు కౌంటర్

Sridhar Babu

Sridhar Babu

Sridhar Babu : హిల్ట్ పాలసీపై బీజేపీ, బీఆర్ఎస్ అవాస్తవాలు ప్రచారం చేస్తూ రాజకీయాలు చేస్తున్నాయని పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయన్నారు. హైదరాబాద్ మరో ఢిల్లీలా కాలుష్య భరిత నగరంగా మారకుండా ఉండేందుకు పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ అవతలి ప్రాంతాలకు తరలించే నిర్ణయం తీసుకున్నామన్నారు.

“బీఆర్ఎస్ పాలనలో ఫ్రీహోల్డ్ ఇచ్చినప్పుడు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు హఠాత్తుగా వ్యతిరేకించడం ప్రజలకు అర్థమవుతుంది. మా ప్రతి నిర్ణయం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే తీసుకున్నదే. మున్సిపాలిటీల విలీనాలు కొత్త విషయం కాదు… గతంలోనూ హైదరాబాద్ అభివృద్ధి కోసం ఇలాంటి చర్యలు అనేక సార్లు జరిగాయి,” అని మంత్రి తెలిపారు.

Hyderabad Metro : మెట్రోలో మహిళల భద్రతకు నూతన అడుగు

“మా జీవోలో ప్రభుత్వ భూములను లీజు నుంచి ఫ్రీహోల్డ్‌గా మార్చే అవకాశం లేదు. పట్టాలు ఉన్న వ్యక్తుల సొంత భూములకే కన్వర్షన్ ఫీజు విధించాం. కానీ బీఆర్ఎస్ హయాంలో మాత్రం ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే జీవోలు ఇచ్చారు. పరిశ్రమల పేరుతో ప్రభుత్వ భూములపై యాజమాన్య హక్కులను బదిలీ చేసిన చరిత్ర కూడా వారిదే. హిల్ట్ పాలసీలో మేము ఎస్‌ఆర్‌వో రేటు కంటే ఎక్కువ కన్వర్షన్ ఫీజులు పెట్టాం. ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నారనేది పూర్తిగా అవాస్తవం.” అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (HILT) పాలసీపై రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ORR లోపల ఉన్న ఇండస్ట్రియల్ పార్కుల్లోని 9,292 ఎకరాలను మల్టీయూజ్ జోన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీతో రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వ వాదన. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. భూమిని తక్కువ ధరలకు విక్రయించే ప్రయత్నం జరుగుతోందని, మొత్తంగా 5 లక్షల కోట్ల భారీ స్కామ్ జరుగుతోందని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు.

Oxford Word of the Year 2025: ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా Rage Bait.. దీని అర్థం ఏంటంటే?

Exit mobile version