NTV Telugu Site icon

D. Sridhar Babu: చిన్నారిపై అత్యాచార ఘటన.. మంత్రులు సీరియస్‌

Sridhar Babu

Sridhar Babu

D. Sridhar Babu: చిన్నారిని చిదిమేసిన నిందితున్నీ వదిలేది లేదని మంత్రులు సీతక్క,శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రులు సీతక్క,శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి కఠిన శిక్ష విధిస్తామన్నారు. రైస్ మిల్లులో పని చేస్తున్న వారి పై వివరాలు తెలుసుకునేందుకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ ఘటన పై ప్రభుత్వం చాలా సిరీయస్ గా ఉందన్నారు.

Read also: Pushpa 2 : పోస్ట్ పోన్ కి కారణం అదేనా..?

ఇలాంటి సంఘటనల పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారి సరైన వివరాలు తెలుసుకొని రైస్ మిల్లు యజమానులు పనిలోకి తీసుకోవాలన్నారు. గంజాయి,డ్రగ్ పై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందని తెలిపారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా అదుకుంటుందన్నారు. ప్రభుత్వం తరుపున 2.50 లక్షల, రైస్ మిల్లు తరుపున మరో 5 లక్షలు పరిహారం అందిస్తామన్నారు. బాధిత కుటుంబంలో ఒకరి ఉద్యోగం, ఇల్లు, ఉన్న చిన్న పాప చదువులకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.

Read also: Happy Fathers Day: నాన్న మాటల్లో ప్రేమ.. కోపంలో బాధ్యత.. అణుక్షణం బిడ్డ గురించే ఆలోచన..

మరోవైపు సీతక్క మాట్లాడుతూ.. ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, దీనికి కారణం గంజాయి,డ్రగ్స్ అన్నారు. మత్తుకు అలవాటు పడి వావి-వరస అనే తేడా లేకుండా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల మధ్య పడుకున్న చిన్నారిని తీసుకెళ్లి అత్యాచారం,హత్య చేసిన ఘటన చాలా బాధాకరం అన్నారు. ఈ ఘటన పై ప్రభుత్వం చాలా సిరియస్ గా తీసుకుందని తెలిపారు. రాత్రి వేళలో పోలీసులు గస్తీ పెంచాలన్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చెయ్యాలన్నారు. గంజాయి, డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోందన్నారు. గంజాయి రహిత,డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనే ముఖ్యమంత్రి లక్ష్యం అన్నారు. అన్ని రకాలుగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం పరంగా ఆదుకుంటుందని తెలిపారు.
Jagadish Reddy: గతంలో ఒప్పుకుని ఇప్పుడు అభ్యంతరమా? జగదీష్‌ రెడ్డి సీరియస్‌