NTV Telugu Site icon

ఓయూలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు నిరసన సెగ

తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం క్యాంపస్ కి వెళ్లారు. ఈ సందర్బంలో విద్యార్థులు మంత్రికి అడ్డుగా వచ్చి గో బ్యాక్ అంటూ నిరసన వ్యక్తంచేశారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆయన్ను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, కేజీ టూ పీజీ హామీలు ఏమైయ్యాయంటూ నిలదీశారు. అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో మంత్రి క్యాంపస్ లోకి ప్రవేశించారు.

కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా కింద చేపడుతున్న సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, సింథటిక్ టెన్నిస్ కోర్టు, అమ్మాయిల కోసం స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. దాదాపు 13 కోట్ల రూపాయలతో ఓయూలో ఈ పనులు చేపట్టారు. యూనివర్సిటీలోని గ్రౌండ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, యూనివర్సిటీ అధికారులు కూడా పాల్గొన్నారు.