Adilabad Crime: ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటాన్నా చట్టాలు తీసుకువస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేద. వారికి వావీ వరసలు చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ప్రతీరోజు ఎక్కడో చోట అత్యాచారాలు లైంగిక వేధింపులు ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఓ మృగాడు స్పోర్ట్స్ పేరుతో బాలికలపై చేయి వేస్తూ.. అసభ్యంగా ప్రవరిస్తూ వారి నరయాతన అనుభవించేలా చేయడమే కాకుండా వారికి వాట్సప్స్ చాటింగ్ లో అసభ్యకరమైన చాటింగ్ చేయడంతో ఆ మాస్టారు భాగోతం వెలుగులోకి వచ్చింది. శిక్షణనిచ్చే బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడనే అతని ఆగడాలు బయటపడడంతో సస్పెన్షన్ వేటుపడింది.
Read also: Rain Alert : తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. మరో రెండ్రోజులు వర్షాలు
ఆదిలాబాద్ జిల్లా లోని క్రీడా పాఠశాలలో బి.రవీందర్ అథ్లెటిక్స్ శిక్షకుడిగా పని చేస్తున్నాడు. ఇతను రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులకు అయిదేళ్లుగా శిక్షణనిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఓ బాలికలపై అనుచితంగా ప్రవర్తిస్తూ వెకిలి చేష్టలకు పాల్పడుతూ ఉండేవాడు. అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తే తమనే తప్పు పడతారని భయంతో బాలికలు వెనుకంజ వేశారు. కాగా.. ఇటీవల అనారోగ్యంతో ఇంటికి వెళ్లిన ఓ బాలికతో వాట్సాప్‌లో అసభ్యంగా చాటింగ్ చేశాడు. చాటింగ్ లో నువ్వంటే నాకిష్టం, చెయి వేస్తే అసహించు కుంటున్నావ్ ఎందుకు అంటూ చేశాడు. దీంతో షాక్ కు గురైన బాలిక ఆ చాటింగ్‌ను కేర్ టేకర్‌కు చూపించింది. ఆమె అనంతరం ఆ చాటింగ్‌ను ప్రిన్సిపాల్ వజ్రమాల దృష్టికి తీసుకొచ్చారు. ఆ చాటింగ్ చూసిన ప్రిన్సిపాల్ తీవ్రంగా పరిగణించిన ప్రిన్సిపాల్ జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్లుకు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టగా..మరో బాలిక సైతం కోచ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. దీనిపై తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ రాహుల్‌రాజ్ కోచ్‌ను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
Google Doodle: నోబెల్ గ్రహీత బర్త్‌డే.. ఓజోన్ పొరను రక్షించడంలో సహాయపడిన శాస్త్రవేత్త