NTV Telugu Site icon

Delhi: ఖమ్మం విద్యార్థినికి అరుదైన అవకాశం.. ఎర్రకోట వేడుకలకు కేంద్రం ఆహ్వానం

Khammamstudentdelhi

Khammamstudentdelhi

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ నుంచి ప్రత్యేక అతిథులను కేంద్రం ఆహ్వానించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు, వివిధ సామాజిక రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విభిన్న ప్రత్యేక అతిథులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. అతిథుల జాబితాలో రైతు ఉత్పత్తి సంస్థల (FPOలు), అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, డ్రోన్ దీదీ/లఖపతి దీదీ ప్రతినిధులు ఉన్నారు. ఈ ప్రత్యేక అతిథులు దేశ సాధికారత కోసం చేస్తున్న కృషి చేస్తున్నందుకు గుర్తింపుగా ఈ ఆహ్వానాలు పంపబడ్డాయి.

ఇది కూడా చదవండి: Enforcement Directorate: ఈడీ డైరెక్టర్‌గా రాహుల్ నవీన్ నియామకం..

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని తెలంగాణ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న వి గ్రేషిత ఎర్రకోట వేడుకలకు హాజరుకావాలని పిలుపువచ్చింది. కేంద్రం నుంచి ఆహ్వానం రావడం పట్ల గ్రేషిత హర్షం వ్యక్తం చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి అరుదైన అవకాశం రావడం పట్ల పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయురాలు కూర సుజాత కూడా ఆనందం వ్యక్తం చేసింది. మే. 2024లో ఆమె గుజరాత్‌లో జరిగిన జాతీయ స్థాయి ప్రేరణ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది. అలాగే మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ వాసి శశాంక్ విశ్వనాథ్ కూడా ప్రత్యేక ఆహ్వానం అందుకోవడం పట్ల తన ఆనందాన్ని తెలియజేశారు.

ఇది కూడా చదవండి: Kirti Chakra: కల్నల్ మన్‌ప్రీత్ సింగ్‌కి మరణానంతరం ‘కీర్తిచక్ర’

Show comments