Site icon NTV Telugu

విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలి: హరీష్‌రావు

కృష్ణా జలాలపై మంత్రి హరీష్‌రావు మీడియా సమావేశంలో మాట్లాడు తూ.. కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఏడేళ్లుగా కేంద్ర ప్రభు త్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందన్నారు. నీటి కేటాయిం పులపై తెలంగాణ ఏర్పడిన 42రోజుల్లోనే కేసీఆర్‌ కేంద్రానికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. కృష్ణా జలాలపై మాకు న్యాయపరమైన హక్కు కావాలి. ఇదేమి గజేంద్ర షెకావత్‌ తో వ్యక్తిగత పంచాయతీ కాదన్నారు. కేంద్రం స్పందించకపోవడం వల్లనే మేము ఆగస్ట్‌ 2015లో సుప్రీం కోర్టు గడప తొక్కాం. చట్ట ప్రకారంగా మీదగ్గరికి వచ్చినా మీరు నిర్ణయం తీసుకోలేదని అందుకే సుప్రీం కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందన్నారు.

గతంలో నీటి పారుదల శాఖ మంత్రిగా నేనే ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న మంత్రులందరికి సమస్యను పరింష్కరించాలని లెటర్లు ఇచ్చా మన్నారు. అయినా కూడా ఎవ్వరి దగ్గరి నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదన్నారు. ఏడేళ్లు నుంచి కేంద్రం కృష్ణా జలాల సంగతి తెల్చ కుండా రాష్ట్రాల మధ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టించాలని చూస్తోం దని హరీష్‌ రావు ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హారీష్ రావు అన్నారు.

Exit mobile version