Independence Day : అసెంబ్లీలో త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించిన స్పీకర్ పోచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. అయితే ఇప్పటికే ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రధాని హోదాలో మోడీ 9వ సారి జాతీయ జెండాను ఎర్రకోటపై ఆవిష్కరించడం విశేషం. అయితే.. ఈ నేపథ్యంలోగా తెలంగాణలోనూ స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే.. ఉదయం తెలంగాణ అసెంబ్లీలో స్వతంత్ర వజ్రోత్సవ, 76 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్పీకర్ పోచారం శ్రీనివాస్ తివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతేకాకుండా.. శాసన మండలిలో గుత్తా సుఖేందర్ రెడ్డి మువ్వెన్నల జెండాను ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే.. అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ, అంబేద్కర్‌కు నివాళాలర్పించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ నివాసం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం స్వతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకల్లో ప్రతిఒక్కరు భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు మంత్రి తలసాని. ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు.
Also Read
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
తాజావార్తలు
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్‌పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!