South central railway: సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్.. ప్రతి గురువారం స్పెషల్ వీక్లీ ట్రైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South central railway: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు కాచిగూడ-తిరుపతి, కాచిగూడ-కాకినాడ పట్టణాల మధ్య నడుస్తాయి. అధికారులు వెల్లడించిన రైళ్ల షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. నేటి నుండి ప్రతి గురువారం హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి తిరుపతికి (రైలు నంబర్ 07061) ప్రత్యేక వీక్లీ రైలు నడుస్తుంది. ఈ ప్రత్యేక రైలు ప్రతి గురువారం రాత్రి 10.10 గంటలకు కాచిగూడ నుండి బయలుదేరుతుంది. మరుసటి రోజు అంటే శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి నుండి కాచిగూడకి (రైలు నెం. 07062) ప్రతి శుక్రవారం మే 26 నుండి ప్రత్యేక వీక్లీ రైలు నడుస్తుంది. ఈ రైలు తిరుపతి నుండి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి మరుసటి రోజు అంటే శనివారం ఉదయం 4 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రెండు మార్గాల్లోని షాద్‌నగర్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, కడప, రాజంపేట, రేణిగుండ రైల్వేస్టేషన్లలో ఈ ప్రత్యేక రైళ్లు ఆగుతాయని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ నెల 27 నుంచి ప్రతి శనివారం కాచిగూడ నుంచి కాకినాడ పట్టణానికి (రైలు నంబర్ 07417) ప్రత్యేక వీక్లీ రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైలు ప్రతి శనివారం కాచిగూడ నుంచి రాత్రి 8.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 28 నుంచి ప్రతి ఆదివారం కాకినాడ పట్టణం నుంచి కాచిగూడకు (రైలు నంబర్ 07418) ప్రత్యేక రైలు నడపనున్నారు. ఈ రైలు ప్రతి ఆదివారం కాకినాడ పట్టణంలో రాత్రి 9.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రెండు మార్గాల్లో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.
Jogi Ramesh: నయా పెత్తందార్ల పక్షాన చంద్రబాబు ఆరాటం
Also Read
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!