Site icon NTV Telugu

Trains Cancelled: వర్షాల, వరదల ఎఫెక్ట్.. 17వ తేదీ వరకు రైళ్లు రద్దు

Trains

Trains

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి.. హైదరాబాద్‌లో ఇవాళ కాస్త రిలీప్‌ ఇచ్చినా.. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసాయి.. ఇక, జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అవుతోంది.. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. అయితే, రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.. భారీగా వరదలు పోటెత్తుతుండడంతో.. బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి 17వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది దక్షిణమధ్య రైల్వే.. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల పరిధిలో నడిచే 34 ఎంఎంటీఎస్‌ సర్వీసులతో పాటు.. ఇతర ప్రాంతాలకు వెళ్లే 15 రైళ్లు రద్దు చేసినట్టు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే పేర్కొంది.

Read Also: India vs England: ఇంగ్లండ్‌తో రెండో వన్డే.. జోష్‌లో టీమిండియా..!

34 ఎంఎంటీఎస్‌లతో పాటు సికింద్రాబాద్ – ఉందాన‌గ‌ర్- సికింద్రాబాద్ ప్యాసింజ‌ర్ రైలు, సికింద్రాబాద్ – ఉందాన‌గ‌ర్ మెము రైలు, హెచ్ఎస్ నాందేడ్ – మేడ్చల్ – హెచ్ఎస్ నాందేడ్ ప్యాసింజ‌ర్, సికింద్రాబాద్ – మేడ్చల్ – సికింద్రాబాద్ మెము, సికింద్రాబాద్ – బొల్లారం – సికింద్రాబాద్ రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించారు.. వాటితో పాటు కాకినాడ పోర్టు- విజయవాడ స్టేషన్ల మధ్యలో నడిచే రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు పేర్కొంది సౌత్‌ సెంట్రల్‌ రైల్వే.. కాగా, మరో మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని.. రెండు రోజుల పాటు భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన విషయం తెలిసిందే.. దీంతో, ఎంసెట్‌ పరీక్షలను రద్దు చేసింది ఉన్నత విద్యామండలి.. మరోవైపు.. శనివారం వరకు స్కూళ్లకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.. సోమవారం నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

Exit mobile version