Site icon NTV Telugu

SOT Attacks: సైబరాబాద్‌ లోని బల్ట్ షాప్‌ లపై ఎస్ఓటీ దాడులు..!

Sot Raida In Cybarabad

Sot Raida In Cybarabad

SOT Attacks: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బెల్ట్ షాపులపై దాడులు కొనసాగుతున్నాయి. సైబరాబాద్ పరిధిలోని పలు బెల్ట్ షాప్ లపై SOT పోలీసుల దాడులు చేపట్టారు. సైబరాబాద్ వ్యాప్తంగా నిన్న 21 పోలీస్ స్టేషన్ల పరిదిలో 29 బెల్ట్ షాప్స్ పై SOT టీమ్స్ దాడి చేసి రూ. 6,98,500/- విలువగల 635 లీటర్ల మద్యం ‌సీజ్ చేశారు. అత్యధికంగా బలానగర్ జోన్ పరిదిలోని 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో 11 బెల్ట్ షాప్స్ నుండి 336 లీటర్ల అక్రమ మద్యం పట్టుకున్నట్లు బాలనగర్ ఎస్‌ఓటీ డీసీపీ శ్రీనివాస్‌ గుప్తా వెల్లడించారు. తాజాగా.. (శుక్రవారం) రాత్రి ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలోని 7 బెల్టుషాపులపై ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు.

Read also: Sanjay Raut: కేజ్రీవాల్ అంటే ప్రధాని మోడీకి భయం..

రూ.1.56 లక్షలు విలువ చేసే 142 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జగద్గిరిగుట్టలో 71 లీటర్లు, దుండిగల్‌లో 24.24, చందానగర్‌లో 7.8, మియాపూర్‌లో 6.7, కొందుర్గులో 12.48, కడ్తాల్‌లో 8.10, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో 11.7 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత రెండు రోజుల్లో బెల్టు షాపులపై ఎస్‌వోటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సైబరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో అక్రమ బెల్టుషాపులపై దాడులు నిర్వహించారు. రూ.1.34 లక్షల విలువైన 197 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మద్యం విక్రయిస్తే కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు.
Karnataka: బీజేపీ గూటికి గాలి జనార్థన్ రెడ్డి.. కమలం పార్టీలో కేఆర్‌పీపీ విలీనం..

Exit mobile version