NTV Telugu Site icon

Hyderabad: నగరంలో ఏరులై పారుతున్న మద్యం.. ఎంట్రీ ఇచ్చిన ఎస్ఓటీ బృందం

Hyderabad

Hyderabad

Hyderabad: ఎన్నికల సందర్భంగా నగరంలో భారీగా మద్యం పట్టుబడింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యంను ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం సరఫరాను అడ్డుకునేందుకు పోలీసులు అన్ని ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తరలిస్తున్న మద్యంను పోలీసులు ఇప్పటికే పట్టుకున్నారు. తాజాగా ఎస్‌వోటీ పోలీసులు దాదాపు నాలుగు వేల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్‌ సీపీ ఆదేశాల మేరకు ఎస్‌వోటీ పోలీసులు, పలు పోలీస్‌స్టేషన్ల సిబ్బందితో కలిసి సైబరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో నిఘా పెట్టారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న 37 లక్షల విలువైన నాలుగు వేల లీటర్ల మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మూడు ప్రాంతాల్లో మద్యం, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read also: Manish Sisodia: ఢిల్లీ హైకోర్టులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్

రంగారెడ్డి జిల్లా లోకసభ ఎన్నికలలోని సైబరాబాద్, పేట్ జహీరాబాద్, బాచుపల్లి, కేపీహెచ్ బీ, బాలానగర్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులకు స్థానిక సమాచారంతో ఎంట్రీ ఇచ్చిన ఎస్ఓటీ పోలీసులు 7 లక్షల విలువ చేసే 4 వేల లీటర్ల మద్యం సీజ్ చేశారు.
అక్రమంగా మద్యం రవాణా చేస్తే వారి తాటా తీస్తామని అన్నారు. పేట్ జహీరాబాద్, బాచుపల్లి, కేపీహెచ్బీ, బాలానగర్ లలో ఎస్ఓటీ బృందం తనిఖీలు చేపట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది. పోలీసుల తనిఖీల్లో మద్యం సీజ్ చేసి, పలువురిని అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Vegulla Jogeswara Rao: వివాదానికి దారితీసిన.. టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు..!