హైదరాబాద్‌లో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. తన తండ్రి పట్ల కర్కశంగా వ్యవహరించాడో కుమారుడు.. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని కిరాతకంగా కొట్టిచంపాడు. జీడిమెట్లలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్‌లో సత్యనారాయణ (63) అనే వ్యక్తి ఐదేళ్లుగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్నాడు.. పక్షవాతంబారినపనడి మంచానికే పరిమితం అయ్యాడు.. అయితే, మద్యం మత్తులో తండ్రితో గొడవపడిన సురేష్ అనే కుమారుడు.. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయి కర్రతో, బెల్ట్‌తో సత్యనారాయణపై దాడికి తెగపడ్డాడు.. తీవ్రగాయాలపాలైన సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. నిందితుడు సురేష్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
Read Also: Minister Bindu: గొప్పమనసు చాటుకున్న మంత్రి.. వైద్యం కోసం బంగారు గాజులు దానం..
