Software Engineer: సాఫ్ట్‌వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్

Software Engineer Seetharam

Software Engineer Seetharam

హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతారాం (36) మరణానికి కారణం భార్య అక్రమ సంబంధాలు అని సీతారాం విడుదల చేసిన 19 పేజీల సూసైడ్ నోట్‌లో స్పష్టంగా ప్రస్తావించాడు. ఈ కేసులో భార్య రేణుక, ఆమె లవర్ రమణ రెడ్డి, శ్రవణ్ అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న సీతారాం, తన సూసైడ్ నోట్‌లో భార్య రేణుకకు మూడు అక్రమ సంబంధాలు ఉన్నట్లు ఆరోపించాడు.

ఆ నోట్‌లో ఇలా రాశాడు.. “నా భార్యకు మూడు అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఎంత నచ్చజెప్పినా ఆమె వ్యవహారశైలి మారలేదు.” “నెలకు 2 లక్షల జీతం వస్తుండగా, నా భార్యను చాలా బాగా చూసుకున్నాను. అయినప్పటికీ, నాకు తెలియకుండా ఆమె ఇంత మందితో అక్రమ సంబంధాలు పెట్టుకుంది.” “ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా, భార్యను గుడ్డిగా నమ్మడమే నేను చేసిన తప్పా.” అని సీతారాం ఆవేదన వ్యక్తం చేశాడు.

సీతారాం సూసైడ్ నోట్‌లో భార్య రేణుక, ఆమె లవర్ రమణ రెడ్డి కలిసి ఉన్న ప్రైవేట్ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు కూడా ప్రస్తావించాడు. ఆ వీడియోల గురించి అడిగినందుకు గతంలో రేణుక సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు సీతారాం తెలిపాడు. పోలీసులు ఈ కేసులో భార్య రేణుక, ఆమె అక్రమ సంబంధం ఉన్న రమణ రెడ్డి, శ్రవణ్ అరెస్ట్ ని అరెస్ట్ చేశారు. సీతారాం రాసిన 19 పేజీల సూసైడ్ నోట్ పోలీసులకు కీలక సాక్ష్యంగా మారింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.