Site icon NTV Telugu

VC Sajjanar : పిచ్చికి పరాకాష్ట.. సోషల్ మీడియా మత్తు..!

Vc Sajjanar

Vc Sajjanar

VC Sajjanar : సోషల్ మీడియా ఫేమ్ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే పరిస్థితి పెరుగుతోంది. తాజాగా ఇలాంటి సంఘటనపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మండిపడ్డారు.

వైరల్ వీడియోలో ఒక యువకుడు రైలు పట్టాలపై పడుకొని, తనపై నుంచి రైలు పోతుండగా వీడియో తీయించుకొని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోను షేర్ చేసిన సజ్జనార్, సోషల్ మీడియా మత్తులో పడిన ఇలాంటి యువతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

“పిచ్చికి పరాకాష్ట.. అంటే ఇదే! రీల్స్ కోసం ఇప్పటికిప్పుడే ఫేమస్ కావాలని తపనపడుతున్నారు. కానీ ఏ రకం వీడియోలు చేస్తున్నామో, ఎంత ప్రమాదకరమో ఆలోచన లేకుండా వెర్రి పనులకు పాల్పడుతున్నారు. ఒకవేళ ప్రమాదం జరిగితే తల్లిదండ్రులు ఎలాంటి క్షోభను అనుభవిస్తారో అర్థం చేసుకునే సోయి వీరికి లేదు” అని సజ్జనార్ వ్యాఖ్యానించారు.

అంతేకాదు, “సోషల్ మీడియా మత్తులో పడిన ఈ మానసిక రోగులకు కౌన్సిలింగ్ అత్యవసరం. లేదంటే వీడియోలు వైరల్ అవుతున్నాయని మరెన్నో ప్రమాదకర పనులు చేస్తూ ప్రాణాలను పణంగా పెడతారు” అని హెచ్చరించారు.

Off The Record : బాల్కొండ బీజేపీలో కలవరం.. పక్క చూపులు చూస్తున్న పార్టీ కేడర్..

నేటితో ముగియనున్న లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్.. 11 మంది నిందితులను నేడు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్న పోలీసులు.. గత 2 పర్యాయాలు నిందితులను వర్చువల్ విధానంలో హాజరుపరిచిన పోలీసులు

Exit mobile version