NTV Telugu Site icon

Chain Snatchers: కానిస్టేబుల్‌పై దాడి చేసిన చైన్ స్నాచర్ అరెస్ట్

Chain Snatchers

Chain Snatchers

భాగ్యనగరంలో అలజడి సృష్టించిన చైన్ స్నాచర్లు అరెస్ట్ చేసారు పోలీసులు. ఇద్దరు చైన్ స్నాచర్లు విశాంత్, రాహుల్ ను సైబరాబాద్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. గుల్బర్గా నుండి జూలై 22న నగరానికి వచ్చిన చైన్ స్నాచర్స్ బైక్ పై వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. జూలై 22 న కొండాపూర్, మూసాపేట్ ఆర్సిపురం లో ముగ్గురు మహిళల చైన్ లు స్నాచింగ్ చేసినట్లు వెల్లడించారు. జులై 25న ఇద్దరు బైకుపై మియాపూర్ లోని మాతృశ్రీ కాలనీ మహిళ గొలుసు లాకెళ్లిన నిందితులు, ఉషోదయ కాలనీలో మరో మహిళ గొలుసు లాగేందుకు ప్రయత్నంచేసారు. అది కుదరకపోవడంతో విఫలమై తప్పించుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చైన్స్ స్నాచర్లు కోసం ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసారు.

గాలింపు చర్యలు వేగవంతంగా చేసారు. బాచుపల్లి నుండి లింగంపల్లి వరకు పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. పల్సర్ బైక్ పై వస్తున్న ఇద్దరు అనుమానస్పద వ్యక్తుల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య పై కత్తితో దాడి చేసి అక్కడి నుండి పరారయ్యారు. అయితే.. తాజాగా విశాంత్, రాహుల్ నిందితులను రామచంద్రపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంటకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

VishnuVardhan Reddy: జగన్ వరద ప్రాంతాలకు వెళ్ళారా.. విహారయాత్రకా?