ఈమధ్యకాలంలో ఇళ్లలో, బైకులు, కార్లలో పాములు దూరుతున్నాయి. దీంతో వాహనదారులు, ఇళ్లల్లో వున్నవారు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇళ్ళల్లో నిద్రిస్తున్న వారిపై పాములు కాటేస్తున్నాయి. ఓ బైక్ లో పాము దూరడంతో వాహనదారుడు తీవ్ర టెన్షన్ కు గురయ్యాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గ్లోబల్ హాస్పిటల్ వద్ద ద్విచక్ర వాహనంలో నాగుపాము కలకలం రేపింది. జిల్లాలోని గణపురం మండలం చెల్పూర్ కు చెందిన రమేష్ అనే వ్యక్తి పని నిమిత్తం భూపాలపల్లికి వచ్చాడు, తన ద్విచక్రవాహనంపై తిరిగి వెళుతున్నాడు.ఈ క్రమంలో బైక్ డూమ్ పైకి ఒక్కసారిగా నాగుపాము దర్శనం ఇచ్చింది.
Read Also:Man Cuts Himself: అమ్మవారి దర్శనానికి వచ్చి బ్లేడుతో గొంతు కోసుకున్నాడు..
ప్రయాణం సాగుతున్న సమయంలో తన ముందే పాము కనిపించడంతో కలవరం చెందిన వాహనదారుడు భయాందోళనతో ద్విచక్ర వాహనం పక్కన నిలిపాడు.ఈ ఘటనతో జాతీయ రహదారి పై కొద్దిసేపు గందరగోళం నెలకొంది. స్థానికుల సమాచారం తో స్నేక్ క్యాచర్ ను పిలిపించి పామును పట్టుకొని సురక్షిత అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడంతో వాహనదారుడు ఊపిరి పీల్చుకున్నాడు. వర్షాలు పడడంతో పాములు బయటకు వచ్చి.. కార్లలో, ద్విచక్రవాహనాల్లో వుండిపోతున్నాయి. పాముల పట్ల అప్రమత్తంగా వుండాలని, స్నేక్ క్యాచర్ లను పిలిచి వాటిని బంధించాలని సూచిస్తున్నారు.
Read Also: T20 World Cup: ఆఫ్ఘనిస్తాన్‌పై చెమటోడ్చి గెలిచిన ఇంగ్లండ్
