NTV Telugu Site icon

Kagaznagar Train: రైలులో పొగలు.. చైన్ లాగిన ప్రయాణికులు.. ఆ తరువాత..!

Sirpur Kagaj Nagar

Sirpur Kagaj Nagar

Kagaznagar Train: సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ రైలులో తృటిలో ప్రమాదం తప్పింది. బీబీ నగర్ సమీపంలో రైలు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేశారు. హుటాహుటిన కిందికి దిగి పరుగులు పెట్టారు. అనంతరం రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే బీబీ నగర్ స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. ప్రయాణికులందరిని రైలు నుంచి దింపివేసారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికి ఎటువంటి హానీ జరగకపోవడంతో.. ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. రైలులో పొగలు రావడానికి గల కారణం ఏముంటుందని ఆరా తీస్తున్నారు అధికారులు. ప్రయాణికులు గమనించి మాకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రైలును ఆపివేసామని వెల్లడించారు. పొగలకు గల కారణాలను వెంటనే వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరికి ఎలాంటి హానీ జరగలేదని స్పష్టం చేశారు.

Read also: Rajinikanth: కోలీవుడ్ లో కాస్త ముందే మొదలైన తలైవర్ బర్త్ డే సెలబ్రేషన్స్…

కాగా.. గతంలోనూ పలు రైళ్లలో మంటలు, పొగలు వ్యాపించాయి. 13 ఆగస్టు 2023న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగ కనిపించింది. దీంతో స్టేషన్‌ఘన్‌పూర్‌ రైల్వేస్టేషన్‌లో రైలు నిలిచిపోయింది. ఈ రైలులోని నాల్గవ కోచ్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో రైలు ఆగింది. మరమ్మతులు చేపట్టి రైలును వెనక్కి పంపించారు. 16 జూన్ 2021న ఇంటర్ సిటీ రైలులో కూడా పొగ వచ్చింది. తలమాడు మండలం దూర్లి గేట్ వద్ద పొగలు రావడంతో రైలు ఇంజన్ ఆగిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16న పొగలు కమ్ముకోవడంతో నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలు మహబూబాద్ రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది. రైలు అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక 2022 నవంబర్ 17, 2022 న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు వద్ద నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి మరియు రైల్వే సిబ్బంది దానిని గుర్తించి మంటలను ఆర్పారు. మంటలను ఆర్పేందుకు గూడూరు రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. గతంలో జూన్ 27, 2022న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగ వ్యాపించింది. దీంతో రైలు డోర్నకల్ రైల్వేస్టేషన్‌లో నిలిచిపోయింది. పొగలు వ్యాపించిన బోగీలను వేరు చేసి మరో బోగీకి తరలించారు.
Rajasthan: రాజస్థాన్‌లో మోడీ ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు.. వసుంధర రాజే లేదా ఓం మాథుర్?