Rajinikanth: కోలీవుడ్ లో కాస్త ముందే మొదలైన తలైవర్ బర్త్ డే సెలబ్రేషన్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే కోసం తలైవర్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 12న వరల్డ్ వైడ్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు రజినీ ఫ్యాన్స్. గత అయిదేళ్లుగా రజినీ ఫ్లాప్స్ లో ఉండడంతో కాస్త సైలెంట్ గా ఉన్న ఫ్యాన్స్, ఇప్పుడు జైలర్ సినిమా ఇచ్చిన జోష్ తో నెవర్ బిఫోర్ సెలబ్రేషన్స్ ని రెడీ అయ్యారు. డిసెంబర్ 12న సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి రజినీ-లోకేష్ సినిమా అప్డేట్ బయటకి రానుంది. రజినీకాంత్ ప్రస్తుతం నటిస్తున్న తలైవర్ 170 ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ కూడా డిసెంబర్ 12నే రిలీజ్ కానుంది. రజినీ-లోకేష్ ప్రాజెక్ట్ నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ జరిగినా కూడా సోషల్ మీడియాలో సునామీ రావడం గ్యారెంటీ. ఆ రేంజ్ హైప్ ని అనౌన్స్మెంట్ తోనే మైంటైన్ చేస్తున్న తలైవర్ 171 ప్రాజెక్ట్ కి “కోడ్ రెడ్” అనే టైటిల్ ని లాక్ చేసినట్లు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తల్లో నిజముందో లేదో తెలియాలి అంటే డిసెంబర్ 12 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే. ఇదిలా ఉంటే కోలీవుడ్ లో సూపర్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ కాస్త ముందుగానే స్టార్ట్ అయ్యాయి. రజినీ నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమా, కోలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ సినిమాల్లో ఒకటైనా ‘ముత్తు’ రీరిలీజ్ కి రెడీ అయ్యింది. రేపు ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీని చూడడానికి రజినీ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే రజినీకాంత్, ముత్తు సినిమాల ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. తెలుగులో శివాజీ సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకి రజినీ ఫిల్మోగ్రఫీలో స్పెషల్ ప్లేస్ ఉంటుంది. మరి రజినీ బర్త్ డేకి మూడు రోజుల ముందు నుంచే మొదలైన అభిమానుల సందడి, డిసెంబర్ 12న ఎంత పీక్స్ కి వెళ్తుందో చూడాలి.
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
తాజావార్తలు
-
OTR: నిజామాబాద్ కాంగ్రెస్‌లో ‘పెద్దాయన’కు కొత్త చిక్కులు!
-
Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
-
Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
-
OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..