NTV Telugu Site icon

TSPSC Paper Leakage Case: పేపర్ లీకేజ్ కేసు.. ఆ ముగ్గురి ఇళ్లల్లో సిట్ సోదాలు..?

Tspsc Paper Leakage Case

Tspsc Paper Leakage Case

TSPSC Paper Leakage Case: TSPSC పేపర్ లీకేజ్ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. పేపర్‌ లీకేజ్‌ పై రాజకీయం దుమారం అందుకుంది. నిరనలు, దీక్షల వరకు దారితీస్తున్నాయి. పేపర్‌ లీకేజ్‌ విషయంలో ఒకరిపై ఒకరు మాటల యుద్దం కొనసాగుతుంది. పేపర్‌ లీకేజ్‌ కి కారణం నువ్వుంటే నువ్వు అని ఒకరిపై మరొకరు దుమారం రేపుతున్నారు. టీఎస్‌పీఎస్‌ పేపర్‌ లీకేజ్‌ కేసులో నిందులను అదుపులో తీసుకున్న సిట్‌ దర్యాప్తు కొనసాగుతుంది. కొందరికి నోటీసులు కూడా జారీ చేసింది. ఇప్పటి వరకు పలువురు నిందితులను అదుపులో తీసుకున్న సిట్‌ ఇవాళ షమీమ్, సురేష్, రమేష్ లను రెండో రోజు విచారించున్నారు. గ్రూప్ 1 పరీక్ష రాసిన షమీమ్ తన వద్ద నుంచి ప్రశ్నాపత్రాన్ని ఇంకా ఎవరికైనా షేర్ చేసిందా అనే దానిపై సిట్‌ ఆరా తీస్తుంది. వీరి ముగ్గురి సెల్ ఫోన్ డేటా ను పరిశీలిస్తున్నారు. ప్రవీణ్ , రాజశేఖర్ ల నుండి షమీమ్ ప్రశ్నాపత్రం పొందింది. ఇవాల సిట్ బృందం ముగ్గురు నిందితుల ఇళ్ళల్లో సోదాలు చేయనున్నారు.

Read also: Ambati Rambabu: చంద్రబాబు కోసం పవన్‌ కల్యాణ్‌ పుట్టాడు.. ఆయన్ని దేవుడే రక్షించాలి..!

TSPSC గ్రూప్‌-1 ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో ముగ్గురు నిందితులను సిట్‌ కస్టడీకి తీసుకొని తొలిరోజు వారిలింక్‌లపై ఆరా తీసింది. ఇక ప్రధాన నిందితుడు ప్రవీణ్‌, సిస్టమ్‌ అడ్మిన్‌ రాజశేఖర్‌రెడ్డి గ్రూప్‌-1 ప్రశ్నపత్రాన్ని లీక్‌ చేసి, టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తున్న రమేశ్‌, షమీమ్‌తోపాటు మాజీ ఉద్యోగి సురేశ్‌కు అందించారు. ఈనేపథ్యంలో.. రమేశ్‌, షమీమ్‌తోపాటు సురేశ్‌ను మరో నాలుగురోజులపాటు సిట్‌ అధికారులు విచారించనున్నారు. దీంతో కమిషన్‌లో పనిచేస్తున్న మొత్తం 26 మంది ఉద్యోగులు గ్రూప్‌-1 పరీక్ష రాయగా.. మిగతా ఉద్యోగులను కూడా సిట్‌ అధికారులు ప్రశ్నించనున్నారు. అయితే.. గ్రూప్‌-1లో 100 మార్కులు దాటిన సుమారు వంద మంది విచారణను సిట్‌ పూర్తి చేసింది. ఇక, రాజశేఖర్‌రెడ్డి బావ ప్రశాంత్‌ న్యూజిలాండ్‌లో ఉండటంతో అతనికి కూడా ప్రశ్నపత్రం పంపించి, పరీక్ష రాయించారు. కాగా.. ఇందులో ప్రశాంత్‌ తప్ప అందరిని సిట్‌ అరెస్ట్‌ చేయగా.. అక్టోబర్‌ మొదటి వారంలో ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి పేపర్‌ లీక్‌ చేశారు. దీంతో.. ఆ విషయం తెలుసుకొన్న రమేశ్‌, షమీమ్‌, సురేశ్‌ వారిని బ్లాక్‌మెయిల్‌ చేసి పేపర్‌ను తీసుకున్నట్టు అనుమానాలు రావడంతో ఆ దిశగా విచారిస్తున్నారు. వీరందరూ.. స్నేహపూర్వక ఒప్పందంలో భాగంగానే గ్రూప్‌-1 పేపర్‌ను లీక్‌ చేసి.. ఆ నలుగురికి అందించినట్టు ప్రధాన నిందితులు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.. బ్లాక్‌మెయిల్‌ చేసింది ఈ ముగ్గురా? ఇతరులెవరైనా ఉన్నారా? అనే విషయాలను సిట్‌ పరిశీలిన కొనసాగుతుంది. అయితే ఇప్పటికే కస్టడీలో ఉన్న నిందితుల కాల్‌డాటాను విశ్లేషించి..ఈ ముగ్గురికి పేపర్‌ వచ్చిన తరువాత ఎవరెవరు కలిశారు? అందులో పరీక్ష రాసిన వారెవరు? వారికొచ్చిన మార్కులు ఎన్ని అనే అంశాలను శాస్త్రీయంగా సేకరిస్తున్నారు. నిన్న (బుధవారం) ముగ్గురిని వేర్వేరుగా విచారించి.. సాధారణ విషయాలను రాబట్టారు. ఇవాల రెండోరోజు శాస్త్రీయంగా సేకరించిన ఆధారాలను వారి ముందు ఉంచి ఆయా అంశాలను నిర్ధారించనున్నారు సిట్‌ అధికారులు.
Clash: రామాలయం బయట యువకుల మధ్య హింసాత్మక ఘర్షణ.. పోలీసు వాహనాలకు నిప్పు