NTV Telugu Site icon

Bandi sanjay: రేపు విచారణకు రండి.. బండి సంజయ్ కు సిట్ మరోసారి నోటీసులు

Bandi Sanjay

Bandi Sanjay

Bandi sanjay: బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్‌కి సిట్‌ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇవాల బండి సంజయ్‌ ఇంటికి వెళ్లిన సిట్‌ ఇన్ స్పెక్టర్ అందజేశారు. రేపు విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. సీఆర్‌పీసీ 91 కింద నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసుల్లో సిట్ పేర్కొన్నారు. గ్రూప్ వన్ పేపర్ లీకేజీ అంశంలో సంజయ్ పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.. జగిత్యాల ప్రాంతానికి చెందిన వారే అత్యధికంగా క్వాలి పై అయ్యారంటూ వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకుల కుటుంబ సభ్యులు ఉన్నారంటూ ఆరోపణలు గుప్పించారు. దీంతో ఆరోపణలకు సంబంధించిన అంశంలో సాక్ష్యాలను అందజేయాలంటూ గతంలోనే సంజయ్ కి నోటిసులు ఇచ్చింది సిట్‌. పార్లమెంటు సమావేశాలు ఉండటంతో సిట్ ముందు విచారణకు హాజరు కాలేనని, అసలు సిట్‌ నోటీసులు అందలేదని, ఏ ఇంటికి సిట్‌ నోటీసులు అంటించిందో తెలియదంటూ సంజయ్‌ పేర్కొన్నారు. దీంతో మరోసారి సంజయ్ కి సిట్ నోటీసులు జారీ చేసింది.

Read also: Bank Holidays : ఏప్రిల్‎లో బ్యాంకులకు సెలవులే సెలవులు

నిన్న (24)న సిట్‌ ముందు హాజరు కావాల్సి ఉండగా ఊహించని పరిణామం ఎదురైంది. బండి సంజయ్‌ సిట్‌ కు లేఖ రాశారు. తను సిట్‌ ముందు హాజరుకాలేనని, అసలు సిట్‌ నోటీసులు అందలేదని పేర్కొన్నారు. తన దగ్గర ఉన్న ఆధారాలు సిట్‌ ఇవ్వలేనని లేఖలో పేర్కొన్నారు. సిట్‌ మీద నమ్మకం లేదని తెలిపారు. తన దగ్గర ఉన్న సమాచారాన్ని సిట్‌కు ఇవ్వదలుచుకోలేనని అన్నారు. తనకు నమ్మకం ఉన్న సంస్థల ముందే ఉన్న సమాచారం ఇస్తానని తెలిపారు. ఆ హక్కు నాకు ఉందని అన్నారు. నేను మొదటి నుంచి సిట్టంగ్‌ జడ్జ్‌తో విచారణ జరిపించాలని డిమాంచ్‌ చేస్తున్నాని తెలిపారు. సిట్‌ నోటీస్ లు నాకు అందలేదని, ఈ విషయం నాకు మీడియాలో వచ్చిన కథనాలప్రకారం సమాచారం అందిందని.. ఈ నెల 24 న హాజరు కావాలని కోరినట్టు మీడియా కథనాల ద్వారా నాకు తెలిసిందని అన్నారు. పార్లమెంట్ సభ్యునిగా నేను సభకి హాజరు కావాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. కాదు కూడదు నా హాజరు తప్పని సరి అని మీరు భావిస్తే మరో డేట్ ఇవ్వండి అప్పుడు వస్తా అంటూ లేఖలో పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని డేట్ ఖరారు చేయండి అంటూ సిట్‌ కు బండి సంజయ్‌ లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ మళ్లీ రెండో సారి సిట్‌ సంజయ్‌కు నోటీసులు ఇవ్వడంతో రేపు హాజరవుతారా? లేదా? అనే దానిపై ఉత్కంఠత నెలకొంది.
Virginia : టూత్ బ్రేష్ తో జైలు గోడకు కన్నం.. పరారైన ఇద్దరు ఖైదీలు