Site icon NTV Telugu

Singareni: ఉద్యోగులకు రూ.40 లక్షల బీమా..

సింగరేణి కంపెనీలో పనిచేసే ఆఫీసర్లు, కార్మికులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది యాజమాన్యం.. రూ.40 లక్షల ప్రమాద బీమా వర్తింపజేసేందుకు నిర్ణయం తీసుకుంది.. దీని కోసం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ)తో ఒప్పందం చేసుకుంది… ఎస్బీఐలో ఖాతా ఉన్న సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు ఇకపై రూ.40 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది… ఈ మేరకు సింగరేణి – ఎస్బీఐ మధ్య చారిత్రక ఒప్పందం జరిగింది… ఇప్పటి వరకు ఇన్సూరెన్స్‌ మొత్తం రూ.20 లక్షలగా ఉండగా… ఇకపై రూ.40 లక్షల ప్రమాద బీమా వర్తింపజేసేలా ఈ నిర్ణయం తీసుకుంది సింగరేణి యాజమాన్యం. కాగా, సింగరేణి గనుల్లో తరచూ ప్రమాదాలు జరగడం.. ఉద్యోగులు, కార్మికులకు గాయాలు కావడం.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయిన ఘటనలో ఎన్నో.

Read Also: Sajjala: వివేకా లేకపోవడం వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ.. ఇప్పటికీ వైఎస్‌ మృతిపై అనుమానాలు..!

Exit mobile version