Site icon NTV Telugu

KCR Driving: ఓమ్నీ వ్యాన్ నడిపిన కేసీఆర్.. నెట్టింట ఫోటోలు వైరల్..

Kcr

Kcr

KCR Drove Old Omni Van: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పాత ఓమ్నీ వెహికిల్ ను నడిపారు. కాలి ఆపరేషన్ తర్వాత ఆయన కర్ర సాయం లేకుండా ఇప్పుడిప్పుడే నడుస్తున్నారు. ఈ క్రమంలో మ్యానువల్ కారు నడపాలని డాక్టర్లు ఆయనకు సూచించినట్లు తెలుస్తుంది. దీంతో కేసీఆర్ స్వయంగా ఓమ్నీ వాహనాన్ని నడిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇక, కేసీఆర్ వాహనం నడపటంపై నెటిజన్స్ వెరైటీ కామెంట్స్ చేస్తున్నారు. ‘సారు మళ్లీ కారు నడుపుతున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Toxic: టాక్సిక్ చిత్రంలో బాలీవుడ్ నటి.. ఎవరంటే?

కాగా, గతేడాది డిసెంబర్ 8వ తేదీన అర్ధరాత్రి తన నివాసంలో కాలు జారి కేసీఆర్ పడిపోయారు. ప్రమాదానికి గురైన తర్వాత కేసీఆర్‌కు వైద్యులు తుంటి ఎముకకు చికిత్స చేశారు. ఆ తర్వాత డాక్టర్లు కేసీఆర్‌ను వాకర్ సహాయంతో నడిపించారు. డిశ్చార్జ్ అయినా తర్వాత కూడా ఆయన వైద్యుల సూచన మేరకు చాలా రోజులు ఇంటికే పరిమితమై రెస్ట్ తీసుకున్నారు. అనంతరం కొద్ది రోజులకు చేతి కర్ర సాయంతో నడిచిన తర్వాత.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ తరఫున చేతి కర్ర సాయంతోనే పలు సభలు, సమావేశాల్లోనూ పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు పూర్తిగా కోలుకుని.. డాక్టర్ల సూచనలతో కేసీఆర్ ఓమ్నీ వాహనం నడిపారని పేర్కొన్నారు.

Exit mobile version