Minister Ponnam: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముక్తకంఠంతో సైన్యానికి దేశం మొత్తం సంఘీభావం తెలిపిన కేంద్ర ప్రభుత్వం పోరాటం ఆపివేయడం తీవ్రంగా కలిచివేసింది అన్నారు. మన సైనికులు చేసిన పోరాటం ఎటువంటి కార్యరూపం దాల్చాక ముందే.. ఒక్క ట్విట్టర్ తో దేశ సార్వబౌమత్వాన్ని ప్రశ్నార్థకంగా మిగిల్చారు ప్రధాని మోడీ.. ఇందిరాగాంధీలా దాయాది దేశాన్నీ కట్టడి చెయ్యలేక పోయారు అని సెటైర్లు వేశారు. అనాడు చిన్న చిన్న ఘటనలు జరిగితే.. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను ప్రశ్నించిన మోడీ.. ఇప్పుడు చేసింది ఏంటి అని పొన్నం ప్రభాకర్ అడిగారు.
Read Also: PM Modi LIVE: ఆపరేషన్ సిందూర్.. ప్రధాని మోడీ కీలక సందేశం లైవ్..
అయితే, కేంద్ర ప్రభుత్వం చర్యలకు దేశ ప్రజలు, కాంగ్రెస్ అధిష్టానం అన్ని రకాలుగా మద్దతు ఇస్తామంటే, ట్విట్టర్ పోస్టుకు స్పందించడం అందరిని కలిచి వేసిందన్నారు మంత్రి పొన్నం. ఇక, యుద్ధ విరమణ ఎందుకు జరిగిందో పార్లమెంట్ వేదికగా చర్చలు జరగాలని రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే కోరుతున్నారు.. చర్చలు లేకుండా ఒక ట్విట్టర్ పోస్టుతో యుద్ధ విరమణ ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రధాని మోడీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక, అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం వాళ్ళు కూడా పాకిస్తాన్ పై చేసే దాడులకు మద్దతిస్తే, విరమణ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నారు. ఎందుకు పోరాటాన్ని అపారాని దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది.. ఒక భారతదేశ పౌరుడిగా నేను ప్రధానినీ ప్రశ్నిస్తున్నాను అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
