Site icon NTV Telugu

Harish Rao: రైతు చనిపోతే ఐదు లక్షల భీమా ఇస్తున్నాం.. ఇలా ఎవరూ అయిన ఇచ్చారా?

Harish Rao

Harish Rao

Harish Rao: సిద్దిపేట జిల్లా రాఘవాపూర్ రైతు వేదికలో 24 గంటల కరెంటు, కాంగ్రెస్ పార్టీ వాఖ్యలపై నిర్వహించిన సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. తెలంగాణ అంటేనే ఒకప్పుడు కరెంట్ కోతలని గుర్తు చేశారు. కాంగ్రెస్ వాళ్లకి తెలివి ఉందా లేదా అని అర్ధం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలూ ఆలోచించాలి 3 గంటల కరెంటు కావాలా? 24 గంటల కరెంటు కావాలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను నమ్మితే మోసపోతామని అన్నారు. కాంగ్రెస్ అంటేనే చీకటి బీఆర్‌ఎస్‌ అంటే వెలుతురని అన్నారు.

Read also: Uttarakhand: ఉత్తరఖండ్ చమోలిలో పెను ప్రమాదం.. ట్రాన్స్‌ఫార్మర్ పేలి 10 మంది మృతి

ఒకడు గల్లిలో మరొకడు ఢిల్లీ లో కూర్చుని మాట్లాడుతున్నారని తెలిపారు. రైతు చనిపోతే ఐదు లక్షల భీమా ఇస్తున్నాం.. ఇలా ఎవరూ అయిన ఇచ్చారా? అని ప్రశ్నించారు. అనంతరం రాఘవాపూర్ లో ఋతు ప్రేమ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మహిళలు తక్కువగా రావడంతో అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఋతుప్రేమ అంటే ఏమిటని మహిళలకు అర్ధమయ్యే విధంగా చెప్పడంలో ఆశ వర్కర్ కు ఫెయిల్ అయ్యారని మంత్రి అన్నారు. మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడా ఫెయిల్ అయ్యారని తెలిపారు. నేను అనుకున్న స్థాయిలో మహిళలు రాలేదని మంత్రి హరీశ్ రావు అసహనం వ్యక్తం చేశారు.
Sukumar: ‘బేబీ’కి పడిపోయిన సుకుమార్!

Exit mobile version