NTV Telugu Site icon

Teachers Transfers: సార్.. వెళ్ళొదంటూ ఏడ్చిన విద్యార్థులు.. భావోద్వేగానికి లోనైన టీచర్లు..

Teacher Tranfors

Teacher Tranfors

Teachers Transfers: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా 25 వేల మంది ఎస్జీటీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఉత్తర్వులు వెలువడ్డాయి. బదిలీ అయిన వారిలో ఎక్కువ మంది సోమవారం తమ కొత్త క్యాంపస్‌లలో చేరారు. రంగారెడ్డి జిల్లా మినహా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఈ జిల్లాలో రెండు మూడు రోజుల్లో పూర్తవుతుంది. ఇది ఇలా ఉంటే మరోవైపు ఉపాధ్యాయుల బదిలీల్లో అటు టీచర్లు, ఇటు విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. ట్రాన్స్ఫర్ పై వెళుతున్న ఉపాధ్యాయులను సార్, మేడం మమ్మళ్లి విడిచి వెళ్లొద్దంటూ పట్టుకుని విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. దీంతో ఏడుస్తున్న విద్యార్థులను చూసిన ఉపాధ్యాయులు భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మండలాలు, జిల్లాల్లో ఇదే వాతావరణ కనిపించింది.

Read also: Rahul Gandhi: హిందువులపై వ్యాఖ్యలు.. రాహుల్ ప్రసంగంలోని చాలా భాగాలు డిలీట్

ఉపాధ్యాయుల బదిలీపై సిద్దిపేట జిల్లాలో విద్యార్థులు కంటతడి పెట్టారు. బదిలీపై వెళ్లిన సిద్దిపేటలోని కాళ్లకుంట కాలనీకి చెందిన యూపీఎస్ టీచర్ జయశ్రీని పట్టుకుని మేడం మీరు వెల్లకండి అంటూ విద్యార్థులు వేడుకున్నారు. చేర్యాల (మం) ఆకునూరు పాఠశాలలో బదిలీపై వెళ్లిన ఏడుగురు టీచర్లను చుట్టుముట్టి వెళ్ళొదంటూ విద్యార్థులు ఏడ్చిన తీరు అక్కడున్న వారందరిని కలిచివేసింది. విద్యార్థులను సముదాయించేందుకు వచ్చి టీచర్లు భావోద్వేగానికి లోనైన తీరు అక్కడి వాతావరణం కన్నీటి ధారలు కురిపించింది.

Read also: Stock Market : చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. బడ్జెట్ కు ముందు 80000వేలు దాటిన సెన్సెక్స్

మరోవైపు నల్గొండ జిల్లా డిండి మండలం వావికోల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముద్దాడ బాలరాజు 9 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేశాడు. ఇటీవల ప్రభుత్వం చేసిన బదిలీల్లో బాలరాజు మండలంలోని కొత్తతండాకు బదిలీ అయ్యారు. టీచర్ బదిలీపై వెళుతుండగా విద్యార్థులంతా కంటతడి పెట్టారు. ఇన్నాళ్లు ఆదరించి ప్రేమించిన గురువు తమను వదిలిపెట్టవద్దని వేడుకున్నాడు. విద్యార్థులంతా తమతో కలిసి భోజనం చేసిన ఉపాధ్యాయుడు బాలరాజుకు తినిపించి తమ ప్రేమను చాటుకున్నారు. ఉపాధ్యాయులకు బదిలీలు సహజమని, ఎక్కడ ఉన్నా మీ మేలు జరగాలని కోరుకుంటూ అవసరమైన సహకారం అందిస్తానని విద్యార్థులను ఓదార్చారు. విద్యార్థినులు ఆయనపై అభిమానంతో ఉద్వేగభరితమైన క్షణాలను చూసి ఉపాధ్యాయుడు కూడా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఉన్న అనురాగం గ్రామస్తులను, తల్లిదండ్రులను కట్టిపడేసింది.
Double iSmart: రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్న ‘స్టెప్పా మార్‌’.. ఈ ఏడాదికే నం.1 మాస్ సాంగ్!