NTV Telugu Site icon

BRS-Congress Flexi War: సిద్దిపేటలో టెన్షన్ టెన్షన్.. హరీష్ రావు ట్వీట్ వైరల్..

Brs Congress Flexi War

Brs Congress Flexi War

BRS-Congress Flexi War: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల నినాదాలతో నిన్న (శుక్రవారం) అర్ధరాత్రి సిద్దిపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు రాజీనామా చేయాలంటూ పట్టణంలో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి బీఆర్‌ఎస్‌ నాయకులను అక్కడి నుంచి పంపించారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు హరీశ్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేసి అక్కడున్న ఫ్లెక్సీల చింపివేశారు. ఈ ఘటనపై సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఫ్లెక్సీల చింపివేతపై హరీష్ రావు ట్వీట్ చేశారు.

Read also: Prabhas Fauji: ఇంట్రెస్టింగ్‭గా ప్రభాస్, హను రాఘవపూడి సినిమా అప్డేట్..

సిద్ధిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయమన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనం అని మండిపడ్డారు. వెంటనే ఈ ఘటనపై @TelanganaDGP గారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు.

Read also: Doctors Strike: మూతపడిన చిన్నా,పెద్దా ఆస్పత్రులు.. సమ్మె చేస్తున్న వైద్యుల 5 డిమాండ్లు ఇవే..

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని తీసుకుని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి కాంగ్రెస్ నాయకులు బైక్ ర్యాలీగా బయలుదేరారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని పెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ ఎందుకు ఉంటుందని కాంగ్రెస్ ప్రశ్నించింది. దీంతో సిద్దిపేటలో ఫ్లెక్సీల వార్ మరింతగా హీట్ పెంచింది. అయితే సిద్దిపేటలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎక్కడికక్కడ కట్టడి చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
Sabarmati Express: కాన్పూర్ రైలు ప్రమాదం.. స్పందించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్