SI And Constable Events: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. నేటి నుంచి ఈవెంట్స్.. ఇవి తప్పనిసరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో కీలకమైన ఈవెంట్స్ ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతున్నాయి.. అయితే, అభ్యర్థులకు కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి.. అడ్మిట్ కార్డులో పేర్కొన్న సమయానికి.. సంబంధిత సెంటర్‌కు వెళ్లకుంటే.. అభ్యర్థిత్యం రద్దు చేయనున్నట్టు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) ఇప్పటికే ప్రకటించింది.. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక రాతపరీక్షలో అర్హులైన 2,37,862 మంది అభ్యర్థులకు ఇవాళ్టి నుంచి అంటే.. డిసెంబరు 8వ తేదీ నుంచి జనవరి తొలి వారం వరకూ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ)లు, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ)లు నిర్వహించబోతున్నారు.. ఇందుకోసం కొన్ని సెంటర్లను ఏర్పాటు చేశారు.. అభ్యర్థులకు వాటి సమాచారం కూడా ఇచ్చారు..
హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేటలో కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి పేర్కొంది… అయితే, ఈ పరీక్షలకు అర్హత సాధించి, పార్ట్-2కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు https://www.tslprb.in/ వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది.. దీనిపై ఏవైనా ఇబ్బందులు ఉంటే.. సంబంధిత అభ్యర్థులు 93937 11110 లేదా 93910 05006 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పేర్కొంది.. అంతేకాదు.. support@tslprb.in ఈ-మెయిల్‌కు కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.. అడ్మిట్‌కార్డును అభ్యర్థులు వెంట తీసుకెళ్లాలి.. నియామక తుది ప్రక్రియ పూర్తయ్యేవరకు ఈ అడ్మిట్‌కార్డును భద్రపరచుకోవాలని స్పష్టం చేశారు.
Also Read
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
ఈవెంట్స్‌కు వెళ్లేవారు ఈ విషయాలను గమనించాలి..
ఈవెంట్స్‌కు వెళ్లే అభ్యర్థులు ఈ విషయాలను గమనించాలి.. అడ్మిట్‌కార్డులో పేర్కొన్న సమయానికి ముందే వేదిక వద్దకు చేరుకోవాలి.. గ్రౌండ్లో సామాన్లు భద్రపరుచుకునే క్లాక్‌రూంలు అందుబాటులో ఉండవు.. కావున, మహిళా అభ్యర్థులు నగలు, హ్యాండ్‌బ్యాగ్‌లు తీసుకురావొద్దని స్పష్టం చేసింది. చేతివేళ్లకు మెహిందీ, టాటూలను వేసుకునిరావొద్దని సూచించింది. బయోమెట్రిక్ తీసుకోనుండటంతో చేతివేళ్లకు మెహిందీ, టాటూలను వేసుకురావద్దని పేర్కొంది. మైదానాల్లోకి సెల్ఫోన్లను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని TSLPRB స్పష్టం చేసింది. ఇక, అభ్యర్థులపై డిజిటల్ నిఘా ఉండబోతోంది.. మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే అభ్యర్థి చేతికి డిజిటల్ ఆర్ఎఫ్ఐడీ పరిజ్ఞానంతో కూడిన రిస్ట్‌బ్యాండ్‌ను అటాచ్ చేస్తారు. మైదానం నుంచి బయటికి వెళ్లేవరకు దాన్ని అలాగే ఉంచుకోవాలి. దాన్ని చింపేయాలని చూసినా.. ట్యాంపర్ చేయాలని ప్రయత్నించినా డిస్క్వాలిఫై చేస్తారు. అభ్యర్థులు తొలుత పరుగు పందెంలో పాల్గొనాలి.
ఇక, పురుష అభ్యర్థులు 1600 మీటర్లు, మహిళా అభ్యర్థులు 800 మీటర్ల పరుగును నిర్ణీత సమయంలో పూర్తిచేయాలి. అందులో అర్హత సాధించినవారి ఎత్తు కొలుస్తారు. ఈ పరీక్షలో ఒక సెంటీమీటర్ లేదా అంతకంటే తక్కువ ఎత్తుతో అనర్హులైతే పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.. అయితే, దీనికోసం చీఫ్ సూపరింటెండెంట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అలాంటివారికి అదేరోజు చీఫ్ సూపరింటెండెంట్ నేతృత్వంలోని కమిటీ ఆధ్వర్యంలో తిరిగి ఎత్తు కొలిచి నిర్ణయం ప్రకటిస్తారు. ఎత్తులో అర్హత సాధించిన వారినే లాంగ్‌జంప్, షాట్‌పుట్ పోటీల్లో పాల్గొనేందుకు అనుమతిస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా తమవెంట ఏం తీసుకెళ్లాలనే విషయానికి వస్తే.. అడ్మిట్‌కార్డు/ఇంటిమేషన్ లెటర్, పార్ట్-2 దరఖాస్తు ప్రింటవుట్ కాపీ, కమ్యూనిటీ సర్టిఫికెట్ కాపీ, డిశ్ఛార్జి బుక్/ నిరభ్యంతరపత్రం/ పెన్షన్ పేమెంటల్ ఆర్డర్ కాపీ (మాజీ సైనికోద్యోగులు అయితే), ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్ (గిరిజన అభ్యర్థులు అయితే) తమ వెంట తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!