NTV Telugu Site icon

ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌పై ఫిర్యాదులు.. 88 ఆస్ప‌త్రుల‌కు షోకాజ్ నోటీసులు..

srinivasa rao

క‌రోనా మ‌హ‌మ్మారి విరుచుకుప‌డుతోన్న స‌మ‌యంలో.. ఎవ్వ‌రైనా స‌రే త‌మ‌కు ఏంటి? అన్న‌ట్టుగా.. కొన్ని ప్రైవేట్ ఆస్ప‌త్రులు క‌రోనా రోగుల నుంచి అందిన‌కాడికి దండుకుంటున్నాయి.. కొంద‌రు ల‌క్ష‌లు చ‌దివించినా.. త‌మవారి ప్రాణాలు ద‌క్క‌లేద‌ని వాపోతున్నారు.. క‌నీసం బిల్లులు కూడా వేయ‌కుండా.. వైట్ పేప‌ర్ల‌పై రాసిచ్చి డ‌బ్బులు గుంజేవారు కూడా లేక‌పోలేదు.. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 88 ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌ను ప్ర‌భుత్వానికి ఫిర్యాదులు అందాయి.. దీంతో.. ఆ 88 ఆస్పత్రులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చామ‌ని.. 24 నుంచి 48 గంటల్లో స‌మాధానం ఇవ్వాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస్‌రావు… ఇంకా ఎవ‌రైనా ఆస్ప‌త్రుల‌పై ఫిర్యాదు చేయాల‌నుకుంటే.. 91541 70960 నంబ‌ర్‌ను సంప్ర‌దించాల‌ని సూచించిన ఆయ‌న‌.. ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెడితే.. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఫీజులు వ‌సూలుచేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.