NTV Telugu Site icon

Bandi sanjay: కుర్చీవేసినా కేసీఆర్‌ రాలే.. షెడ్యూల్‌ ఏంటి?

Bandi Sanjay, Cm Kcr

Bandi Sanjay, Cm Kcr

Bandi sanjay: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ సభకు సీఎం కేసీఆర్ ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి షెడ్యూల్‌ను వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌కు ఏం పనులు ఉన్నాయని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను సభకు రావాల్సిందిగా తాము కోరినట్లు చెప్పారు. ఇవాళ ప్రధాని మోడీ సభలో కుర్చీని ఏర్పాటు చేశారని అన్నారు. తాము కేసీఆర్ కోసం ఎదురు చూసామని చెప్పారు. మోడీ సభకు సీఎం కేసీఆర్ వచ్చి ఉంటే శాలువా కప్పి సన్మానించేవారని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ అడ్డంకిగా మారారన్నారు. అభివృద్ధికి కేసీఆర్ సహకరించడం లేదని విమర్శించారు. ప్రధాని మోడీ సభకి ఎందుకు రాలేదో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Read also: Delhi Lodge Case: హనీ ట్రాప్ చేసి చంపేసింది.. ‘సారీ’ నోట్ పట్టించింది

ఇది ఇలా ఉంటే.. అవినీతిని నేను ఒప్పుకోను.. అవినీతి పరుల పట్ల కఠినంగా వ్యవహరిద్దామా? వద్దా? అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ప్రియమైన సోదర సోదరీ మణులారా.. మీ అందరికీ నా హృదయ పూర్వక నమస్కారాలు అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అవినీతి, కుటుంబ పాలన వేర్వేరు కాదు.. కుటుంబ పాలన అన్ని వ్యవస్థలు తన కంట్రోల్ లో ఉండాలని అనుకుంటుందని తెలిపారు. అవినీతి లేకుండా డీబీటీ ద్వారా అన్ని వర్గాలకు సాయం అందిస్తున్నామన్నారు. డిజిటల్ పేమెంట్ వల్ల అవినీతి అక్రమాలకు తావుండదని తెలిపారు. తెలంగాణ -ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముందడుగు.. వందేభారత్ రెండవ ట్రైన్ ప్రారంభించామన్నారు.

భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల నుంచి తిరుమల వెంకటేశ్వరస్వామిని చేరుకునేలా రైలు సర్వీస్ ని అనుసంధానించామని తెలిపారు. 11 వేల కోట్ల ప్రాజెక్టులకు అంకురార్పణ, జాతికి అంకితం చేశాం.. రైల్, రోడ్ కనెక్టివిటీ, హెల్త్ ప్రాజెక్టులు చేపట్టామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకార లేక పోవడంతో ప్రాజెక్ట్ లు ఆలస్యం అవుతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రజలకు నష్టం కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో వేగం పెంచండి.. స్వార్థం కోసం చూసుకుంటున్నారని తెలిపారు. MMTS విస్తరణ చేపట్టడం సంతోషంగా ఉందన్నారు ఇది కొత్త బిజినెస్ హబ్, పెట్టుబడులకు కేంద్రంగా మారిందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా రైల్వే సర్వీసులు చేపట్టామని, రైల్వే ప్రాజెక్టుల విస్తరణ వల్ల చుట్ట పక్కల ప్రజలకు ఉపయోగమన్నారు. గడచిన 9 ఏళ్ళలో హైదరాబాద్ లో 75 కిలోమీటర్ల నెట్ వర్క్ నిర్మించామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.
NTR 30: ఈరోజే లాస్ట్… యాక్షన్ ఎపిసోడ్ ని అదరగొట్టేసారట

Show comments