NTV Telugu Site icon

Hyderabad Night Shopping: నైట్‌ షాపింగ్ చేసే వాళ్లకు బిగ్ షాక్!.. 10.30కే ఆ దుకాణాలు బంద్‌..

Hyderabad Night Shoping

Hyderabad Night Shoping

Hyderabad Night Shopping: హైదరాబాద్‌లో క్రైమ్ రేట్ పెరగడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో శాంతిభద్రతలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. నేరాల సంఖ్య పెరగడానికి అసలు కారణాలను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. రాత్రిపూట ఎక్కువ మంది రోడ్లపైకి రావడం, దుకాణాలు తెరవడంపై పోలీసులు కొంత ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు. దీనిపై సమీక్షించిన సీఎం రేవంత్‌రెడ్డి.. రాత్రి 10.30 నుంచి 11 గంటల మధ్య దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Read also: Hyderabad: పెళ్లి బరాత్‌ను అడ్డుకున్న పోలీసులు.. వాగ్వాదం, తోపులాట..

నగరంలో శాంతి భద్రతలు చాలా ముఖ్యమని వ్యాపారులు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం ఆదేశాల మేరకు పోలీసులు కూడా చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లోని కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ పరిధిలోని వ్యాపార సంస్థలు రాత్రి 10.30 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని దీన్ని అమలు చేయాలని పోలీసులు స్పష్టం చేశారు.రాత్రి 10:30 నుంచి 11 గంటల వరకు దుకాణాలు మూసివేయాలన్న ఆదేశాలపై వ్యాపారులు, నగరవాసుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దుకాణదారులు దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల తర్వాత రోజు జరిగే మొత్తం వ్యాపారం కంటే ఎక్కువ వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు.

Read also: Mallu Bhatti Vikramarka: అత్యాచార బాధితురాలు ఈశ్వరమ్మను పరామర్శించిన భట్టి విక్రమార్క..

అంత త్వరగా దుకాణాలు మూసి వేయాలంటే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. హైదరాబాద్‌కు నైట్ షాపింగ్ కొత్త కళ తెచ్చిందని, రోజంతా ఆఫీసుల్లో ఉండి రాత్రి షాపింగ్ చేసేవాళ్లు ఎక్కువ మంది వస్తారని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి షాపింగ్ చేయడం తప్పా అని మరొక దారి లేదంటూ వాపోతున్నారు. నైట్ షాపింగ్ కు క్రైమ్ రేట్ కు సంబంధం అంటున్నారు. రోజంతా ఆఫీసుల్లో తీవ్ర ఒత్తిడికి లోనయ్యేవారు నైట్ షాపింగ్ కు వస్తారని అలాగే మాక్కూడ అలాంటి అర్ధరాత్రి పూట మాత్రమే షాపింగ్ చేసుకుంటారని తెలిపారు. నేరస్తులను అదుపు చేయాల్సిన పోలీసులే ఇలాంటి వాదన చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. నైట్ షాపింగ్ తీసేస్తే తిండి దొరక్క చచ్చిపోయే పరిస్థితి వస్తుందని హర్ష అనే ఉద్యోగి చెబుతున్నారు. రాత్రి వేళల్లో పనిచేసే వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. నేరాల నియంత్రణకు ఇలాంటివి ప్రయోజనకరంగా ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు.

Show comments