Site icon NTV Telugu

Tension in Gujjukunta: గుజ్జుకుంటలో టెన్షన్‌.. భారీ బందోబస్తునడుమ మల్లేశం అంత్యక్రియలు

Tension In Gujjukunta

Tension In Gujjukunta

Tension in Gujjukunta: దుండగుల చేతిలో హత్యకు గురైన జెడ్పీటీసీ శెట్టె మల్లేశం మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా గుర్జకుంటకు తరలించారు. మల్లేశం హత్య నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుడు నంగి సత్యనారాయణ ఇంటిపై మల్లేశం బంధువులు దాడి చేశారు. ఇంటి కిటికీ అద్దాలతో పాటు కారు ధ్వంసమైంది. మల్లేశం మృతికి న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు నిర్వహించకుండా బంధువులు, గ్రామస్తులు అడ్డుకుంటున్నారు. పోలీసులు మల్లేశం బంధువులకు నచ్చచెప్పడంతో.. శాంతించిన బంధువులు, గ్రామస్తులు ఎట్టకేలకు ZPTC మల్లేశం అంత్యక్రియలు గుజ్జకుంటలో ప్రారంభమయ్యాయి. అంత్యక్రియల్లో పాడే మోసిన జనగామఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పాల్గొన్నారు. సత్తయ్య ఇంటిపై బంధువులు, గ్రామస్తులు మట్టి పోసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలాది మంది రావడంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉన్నందున భద్రతను కట్టుదిట్టం చేశారు.

Read also: Stump Out: టెస్ట్ మ్యాచ్‌లో అరుదైన సీన్.. 145 ఏళ్ల పురుషుల క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి

శెట్టె మల్లేశం మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. పార్థివ దేహానికి ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజారాధాకృష్ణ తదితర నేతలు నివాళులర్పించారు.

Read also:Temples Robberies: ఆలయాలే టార్గెట్‌.. ఏడాదిన్నర కాలంలో మూడు సార్లు చోరీ

చేర్యాల జెడ్పీటీసీ శేట్టే మల్లేశంపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి చేసిన ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండంలం గుజ్జకుంటలో సంచలనంగా మారింది. వాకింగ్ కు వెళ్తుండగా గొడ్డళ్లు, కత్తులతో దాడి దుండగులు చేశారు. దీంతో మల్లేశంకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న మల్లేశంను హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మల్లేశం అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మల్లేశం మృతిచెందారు. మల్లేశం హత్య వెనుక గుజ్జకుంట ఉప సర్పంచ్ సత్తయ్య, శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Sreeleela: ఈ కన్నడ బ్యూటీ టాలీవుడ్ లో నెక్స్ట్ బిగ్ థింగ్ అవుతుందా?

Exit mobile version