Site icon NTV Telugu

రైతులకు భరోసా కల్పించేందుకు దొర బయటికి రారు: షర్మిల

కేసీఆర్‌ ప్రభుత్వం పై షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. రైతుల మరణాలను ఊటంకిస్తూ ట్విట్టర్‌ వేదికగా ఆమె తీవ్ర స్థాయిలో కేసీఆర్‌ పై ధ్వజమెత్తారు. ఓ వైపు రైతులు మరణిస్తున్నా కేసీఆర్‌కు సోయి లేదంటూ మండిపడ్డారు షర్మిల. దొరా మీరిచ్చే హామీలకే దిక్కులేనప్పుడు, మీరు సాయం చేస్తారనే ఆశ లేక,పత్తికి మిరపకు తెగులు సోకి, పెట్టిన పెట్టుబడి రాక, పంటను కాపాడలేని పురుగుల మందే మమ్మల్ని అప్పుల నుంచి కాపాడుతుందని,రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు చనిపోతున్నాదున్నపోతు మీద వాన పడ్డట్టు KCR గారు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు.

Read Also: ప్రగతి భవన్‌ వద్ద జేసీ దివాకర్‌రెడ్డి హల్‌చల్

రైతులకు భరోసా కల్పించేందుకు దొర గారు కాలు బయటపెట్టింది లేదు.అయ్యా దొర గారు,పంజాబ్ రైతుల చావులు మీకు కనపడ్డాయి కానీ రాష్ట్రంలో రైతుల చావులు కనపడటం లేదా? రైతుల చావులను ఆపడం చేతకానిముఖ్యమంత్రిమనకొద్దు అంటూ షర్మిల ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు.


Exit mobile version