Y.S.Sharmila: వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర రేపటి నుంచి పునఃప్రారంభం కానుంది. ఎక్కడైతే తనను అరెస్ట్ చేశారో అక్కడినుంచే ఆమె పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట లింగగిరి నుంచి పాదయాత్ర కొనసాగిస్తారు. పాదయాత్రకు ముందు ఉదయం 11:30లకు తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలవనున్నారు. అయితే.. గత నాలుగు రోజులుగా జరిగిన పరిణామాలను వివరించనున్నారని సమాచారం. ఎమ్మెల్యేల హెచ్చరికలపై, పోలీసుల తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. వైఎస్ షర్మిల పాదయాత్ర పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్న వైఎస్సార్ టిపి శ్రేణులు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేస్తోన్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. లోటస్‌పాండ్‌లోని షర్మిల నివాసం వద్ద బయటకు రాకుండా ఇంటి బయట భారీగా పోలీసులు మోహరించి, ఆమెను హౌస్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఆమె పోలీసుల కళ్లుగప్పి, వారికి తెలియకుండా అక్కడి నుంచి బయలుదేరారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు.. ఆమె ప్రగతి భవన్ చేరకుండా సోమాజిగూడలో అడ్డుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన కారులోనే ఆమె వెళ్లారు. పోలీసులు షర్మిల కారుకు అడ్డంగా తమ వాహనాలను నిలిపారు. షర్మిలను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా ఆమె తన కారు అద్దాలు మూసివేసి కారులోనే బైఠాయించారు. ఎంత చెప్పినా షర్మిల కారు నుంచి బయటకు రావడానికి నిరాకరించడం, ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయిపోవడంతో.. పోలీసులు టోయింగ్ వెహికిల్ రప్పించి షర్మిల ఉండగానే కారుని తరలించారు. తమ అధ్యక్షురాలిని ఇలా అడ్డగించడం, అదుపులోకి తీసుకోవడంతో.. ప్రగతి భవన్ వద్ద వైఎస్సార్టీపీ శ్రేణులు నిరసకు దిగారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
read also: USA: అమెరికా మారదు.. పాకిస్తాన్‌తో కలిసి పనిచేస్తామంటూ ప్రకటన
వీఐపీ రాహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెపై కేసు నమోదైంది. ఆరోపణలతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 333, 353,337 సెక్షన్ల కింద షర్మిలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. కుమార్తె వైఎస్ షర్మిల అరెస్ట్ నేపథ్యంలో ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు బయల్దేరిన వైఎస్ విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా అన్నారు వైఎస్ విజయమ్మ. మరోవైపు వైఎస్ షర్మిలను ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌లోనే ఉంచడంతో వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇంటికి చేరుకున్నారు షర్మిల. షర్మిల ఇంటి దగ్గరే వైఎస్ విజయమ్మ ఉండి షర్మిలకు హారతి ఇచ్చారు. వ్యక్తిగత పూచీకత్తులపై బెయిల్ ఇచ్చింది. షర్మిలతో పాటు మరో ఐదుగురికి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రిమాండ్ విధించాలని పోలీసులు కోరగా తమ క్లయింట్ పై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని షర్మిల పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తే అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆమె ఆరోపించగా.. పోలీసులు అరెస్ట్ చేసిన తీరును తప్పుబట్పటారు షర్మిల తరఫు లాయర్లు. అయితే.. ఇరుపక్షాల వాదనలు విన్న మేజిస్ట్రేట్ షర్మిలకు బెయిల్ మంజూరు చేశారు.
Sankranthi War: చిరు బాలయ్యలు స్పీడ్ పెంచాల్సిందే