NTV Telugu Site icon

ఒక్క‌నీటి బొట్టును కూడా వ‌దులుకోం…ష‌ర్మిల…

హైద‌రాబాద్‌లోని లోట‌స్‌పాండ్ వ‌ద్ద ఉద్రిక్త‌క‌ర‌మైన ప‌రిస్థితులు నెల‌కోన్నాయి.  లోట‌స్ పాండ్‌లోని సోష‌ల్ మీడియాకు సంబందించిన మీటింగ్ ను ఏర్పాటు చేశారు.  ఈ మీటింగ్ కు ముందు ష‌ర్మిల తెలంగాణ ఒక్క నీటిబొట్టును కూడా వ‌దులుకోద‌ని ట్వీట్ చేశారు.  దీనిపై అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి స‌భ్యులు లోట‌స్‌పాండ్‌ను ముట్ట‌డించేందుకు పెద్దఎత్తున అక్క‌డికి చేరుకున్నారు.  దీంతో ష‌ర్మిల అనుచ‌రులకు అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌భ్యుల మ‌ధ్య వివాదం జ‌రిగింది.  ష‌ర్మిల అనుచ‌రులు అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి స‌భ్యుల‌ను బూటుకాలితో తన్న‌డంతో వివాదం మ‌రింత ముదిరింది.  వెంట‌నే పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేసుకొని వివాదానికి కార‌ణ‌మైన వారిని అదుపులోకి తీసుకున్నారు.  నీటి వివాదం జ‌రుగుతున్న స‌మ‌యంలో ష‌ర్మిల చేసిన ట్వీట్ రెండు రాష్ట్రాల మ‌ధ్య పెద్ద వివాదానికి దారితీసింది.