Site icon NTV Telugu

Bomb Treat : షాకింగ్.. షార్జా-హైదరాబాద్ విమానంకు బాంబు బెదిరింపు..!

Bomb Threat

Bomb Threat

Bomb Treat : షార్జా నుండి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానాన్ని అత్యవసరంగా అహ్మదాబాద్‌కు మళ్లించారు. ఈ సంఘటన ప్రయాణికులలో, విమానాశ్రయ అధికారులలో కలకలం సృష్టించింది. ఇండిగో విమానానికి సంబంధించిన అధికారులకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు అందింది. విమానంలో “మానవ ఐఈడీ (IED)” ఉన్నట్లుగా ఈ మెయిల్ ద్వారా బెదిరించినట్లు తెలిసింది. బెదిరింపు రాగానే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.

Keeravani : గ్లోబల్ సమ్మిట్ లో కీరవాణి కచేరి

ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, విమానాన్ని దాని గమ్యస్థానం హైదరాబాద్‌కు కాకుండా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మళ్ళించారు. అహ్మదాబాద్‌లో విమానం ల్యాండ్ అయిన వెంటనే, ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. అనంతరం భద్రతా సిబ్బంది బాంబు స్క్వాడ్‌తో కలిసి విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇటీవల కాలంలో ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఇది రెండవసారి. గతంలో, కువైట్ నుండి హైదరాబాద్‌కు రావాల్సిన మరో విమానానికి బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో, ఆ విమానం ఉదయం 7:45 గంటల ప్రాంతంలో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అప్పుడు కూడా ప్రయాణికులను దించి, బాంబు డిస్పోజల్ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాయి.

Keeravani : గ్లోబల్ సమ్మిట్ లో కీరవాణి కచేరి

Exit mobile version