Gold Smuggling: గోల్డ్ స్మగ్లింగ్.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shamshabad Airport Customs Officials Caught More Than 5 Kilo Gold: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విదేశాల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అమీర్ ఖాన్, మహ్మద్ ఖురేషీ అనే ప్రయాణికుల వద్ద రూ. 3 కోట్ల విలువ చేసే ఐదున్నర కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. అధికారులకు అనుమానం రాకుండా ఉండేందుకు.. ఆ కేటుగాళ్లు చాలా తెలివిగా బంగారాన్ని పేస్టుగా మార్చి, తమ లో-దుస్తుల్లో దాచుకున్నారు. తమ ప్లాన్ వర్కౌట్ అవుతుందని భావించారు. కానీ, వీరి ప్లాన్ బెడిసికొట్టింది. వారి ప్రొఫైల్స్‌పై అధికారులకి అనుమానం రావడంతో, అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే వారి గుట్టు రట్టయ్యింది. బంగారం సీజ్ చేసిన అనంతరం.. ఆ ఇద్దరిపై అక్రమ బంగారం రవాణా కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇలాంటి సంఘటనలు ఈమధ్య తరచూ చోటు చేసుకుంటున్నాయి. అక్టోబర్ 13వ తేదీన కూడా బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు మహిళల్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇద్దరు మహిళల నుంచి.. రూ.74 లక్షల విలువ చేసే 1410 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. అదే నెలలో 6వ తేదీన ఓ ప్రయాణికుడు కూడా అడ్డంగా బుక్కయ్యాడు. అతని కదిలికలపై అనుమానం రావడంతో, అదుపులోకి తీసుకొని విచారించగా.. దాదాపు 5 కిలోల బంగారం లభ్యమైంది. అంతకుముందు జులైలోనూ.. రూ. 50 లక్షలకు పైగా విలువ చేసే 1196 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఒక వ్యక్తి బంగారం గొలుసుకు పూసలు వేసుకోగా.. మరో వ్యక్తి బంగారం కడ్డీలను లోదుస్తుల్లో దాచుకుని తరలిస్తుండగా, అధికారులు పట్టుకున్నారు.
Also Read
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!