Shabad Six Murder Case : షాబాద్ ఆరుగురి హత్య కేసు.. సీఐ క్రాంతి రెడ్డిపై సస్పెన్షన్ వేటు
- ఆరుగురి హత్య కేసులో కీలక చర్య
- సీఐ క్రాంతి రెడ్డి సస్పెన్షన్
- పోక్సో కేసులో నిర్లక్ష్యంపై విమర్శలు
- ప్రాథమిక విచారణ తర్వాత ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shabad Six Murder Case : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు షాబాద్ సీఐ క్రాంతి రెడ్డిని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) తరుణ్ జోషి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడు రాజ్‌కుమార్‌పై గతంలోనే ఒక మైనర్ బాలిక ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ అతనిపై తగిన చavర్యలు తీసుకోకపోవడమే ఈ ఘోరానికి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బాధిత మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గతంలోనే రాజ్‌కుమార్‌పై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, కేసు నమోదైనప్పటికీ నిందితుడిని సకాలంలో అరెస్టు చేయకపోవడాన్ని బాలిక కుటుంబ సభ్యులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. నిందితుడు రాజ్‌కుమార్‌కు షాబాద్ ఎస్సై క్రాంతి రెడ్డితో పాటు స్థానిక ఇన్స్పెక్టర్ కూడా లోపాయికారీగా సహకరించారని, పోలీసుల అండదండలు ఉండటం వల్లే అతను ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టాడని బాధిత కుటుంబ సభ్యులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల వైఫల్యంపై తీవ్ర విమర్శలు రావడంతో రంగంలోకి దిగిన సీపీ, ప్రాథమిక విచారణ అనంతరం ఎస్సై క్రాంతి రెడ్డిని సస్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనలో పోలీసుల కీలక ప్రకటన చేశారు. నిందితుడు రాజ్‌కుమార్‌ను పట్టిస్తే రూ.2లక్షల రివార్డు ఇస్తామని వెల్లడించారు. నిందితుడు రాజ్‌కుమార్ కోసం 10 బృందాలతో పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
- Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్‌లు మృతి
- KTR: 117 సీట్లు కాదు.. కాంగ్రెస్‌కు 7 సీట్లు కూడా రావు.! కాంగ్రెస్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
-
Shabad Six Murder Case : షాబాద్ ఆరుగురి హత్య కేసు.. సీఐ క్రాంతి రెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
Bihar: షాకింగ్ నిర్ణయం.. బంకీపూర్ అభ్యర్థిని మార్చేసిన బీజేపీ.. కారణమిదేనా?
-
Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్‌కు మొజ్తబా వార్నింగ్..
-
Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!