Site icon NTV Telugu

Hakimpet Sports School: లైంగిక వేధింపుల ఘటన.. తెలంగాణ సర్కార్‌ సీరియస్‌

Hakeempeat Crime

Hakeempeat Crime

Hakimpet Sports School: హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో రాత్రిపూట బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని కవిత అన్నారు. కవిత ట్వీట్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని వెంటనే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారులతో పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో మహిళలపై వేధింపులను ఉపేక్షించేది లేదని మంత్రి అన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ట్విట్టర్ వేదికగా సమాచారం అందించారు. నిబంధనలకు విరుద్ధంగా స్పోర్ట్స్ స్కూల్‌లో బాలికలతో అధికారి దురుసుగా ప్రవర్తిస్తున్నారని బాధితులు వాపోయారు.

Read also: Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్, ఏకంగా 20 రైళ్లు రద్దు..!

బాలికల హాస్టల్‌కు రాత్రిపూట అధికారి వచ్చి వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్పోర్ట్స్ స్కూల్‌లో పనిచేసే మహిళా ఉద్యోగినితో సదరు అధికారి దందా నడుపుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై మీడియాలో కథనాలు వచ్చాయి. స్పోర్ట్స్ స్కూల్‌లోని అమ్మాయిలను సాయంత్రం వినోదం కోసం తీసుకెళ్లేవాడు. ఈ స్పోర్ట్స్ స్కూల్‌లో శిక్షణకు వెళ్లే బాలికలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులపై నమ్మకంతో పిల్లలను వదిలి వెళ్లాల్సి వస్తుందని కానీ.. అధికారులే ఇలా కీచకంగా ప్రవర్తిస్తే ఎవరికి చెప్పుకోవాలని మండిపడుతున్నారు. ఇలాంటి వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాలపై అధికారిని ఎవరూ ప్రశ్నించలేదని బాధితులు చెబుతున్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ అంశంపై మీడియాలో వచ్చిన కథనాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలోని రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై మహిళా రెజ్లర్లు ఆరోపణలు చేశారు. ఈ విషయమై మహిళా రెజ్లర్లు కూడా ఆందోళనకు దిగారు. రెజ్లర్ల ఆందోళనల నేపథ్యంలో బ్రిజ్ భూషణ్ పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

Telangana Rains: తెలంగాణలో వర్షాలకు ఛాన్స్.. వచ్చే మూడ్రోజులు కురిసే అవకాశం

Exit mobile version