హైదరాబాద్‌లో సేవాభారతి ఉచిత అంబులెన్స్ సేవలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సమయంలో అంబులెన్స్‌లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.. ఒకవేళ దొరికినా అడిగినంత సమర్పించుకోవాల్సిన పరిస్థితి.. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో సేవా భారతి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభమయ్యాయి. ఉచిత అంబులెన్స్ సేవలు కావాలనుకునేవారు 040-48213100 నంబర్‌ను సంప్రదించాలని సేవాభారతి ప్రతినిధులు తెలిపారు. బర్కత్‌పురా కేశవనిలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సేవాభారతి ప్రాంత అధ్యక్షుడు దుర్గారెడ్డి, కార్యదర్శి ప్రభల రామ్మూర్తి సహా ఇతర సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మరోవైపు. సేవా భారతి ఇటీవలే హైదరాబాద్ నగర శివార్లలోని అన్నోజిగూడలో ఉచిత కోవిడ్ ఐసొలేషన్ సెంటర్ ప్రారంభించింది. 200 పడకల ఈ కేంద్రంలో డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, యోగా సిబ్బంది కోవిడ్ పేషంట్లకు సేవలందిస్తున్నారు. కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నవారు అన్నోజిగూడ ఉచిత కోవిడ్ ఐసొలేషన్ సెంటర్లో అడ్మిట్ కావాలనుకునేవారు ముందుగా 040-48212529 నెంబర్‌ను సంప్రదించాలని సేవాభారతి ప్రతినిధులు తెలిపారు. అంతేకాదు కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా తీర్చేందుకు సలహా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సలహా కేంద్రంలో వైద్యులు ఆన్లైన్ ద్వారా సలహాలందిస్తారు. ఉదయం 8 నుంచి రాత్రి పదిలోగా 040-48213100 నెంబర్‌కు ఫోన్ చేసి కోవిడ్ చికిత్సపై వైద్యుల సలహాలు తీసుకోవచ్చుని సేవా భారతి ప్రతినిధులు సూచించారు.
Also Read
- CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
- Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
- KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
తాజావార్తలు
-
Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
-
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?