NTV Telugu Site icon

హైద‌రాబాద్‌లో సేవాభారతి ఉచిత అంబులెన్స్ సేవలు

Seva Bharati

క‌రోనా స‌మ‌యంలో అంబులెన్స్‌లు కూడా దొర‌క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.. ఒక‌వేళ దొరికినా అడిగినంత స‌మ‌ర్పించుకోవాల్సిన ప‌రిస్థితి.. ఈ ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని హైద‌రాబాద్‌లో సేవా భారతి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్‌ సేవలు ప్రారంభమయ్యాయి. ఉచిత అంబులెన్స్ సేవలు కావాలనుకునేవారు 040-48213100 నంబర్‌ను సంప్రదించాలని సేవాభారతి ప్రతినిధులు తెలిపారు. బర్కత్‌పురా కేశవనిలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సేవాభారతి ప్రాంత అధ్యక్షుడు దుర్గారెడ్డి, కార్యదర్శి ప్రభల రామ్మూర్తి స‌హా ఇతర సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మ‌రోవైపు. సేవా భారతి ఇటీవలే హైదరాబాద్ నగర శివార్లలోని అన్నోజిగూడలో ఉచిత కోవిడ్ ఐసొలేషన్ సెంటర్ ప్రారంభించింది. 200 పడకల ఈ కేంద్రంలో డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, యోగా సిబ్బంది కోవిడ్ పేషంట్లకు సేవలందిస్తున్నారు. కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్న‌వారు అన్నోజిగూడ ఉచిత కోవిడ్ ఐసొలేషన్ సెంటర్‌లో అడ్మిట్ కావాలనుకునేవారు ముందుగా 040-48212529 నెంబర్‌ను సంప్రదించాలని సేవాభారతి ప్రతినిధులు తెలిపారు. అంతేకాదు కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా తీర్చేందుకు సలహా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సలహా కేంద్రంలో వైద్యులు ఆన్‌లైన్ ద్వారా సలహాలందిస్తారు. ఉదయం 8 నుంచి రాత్రి పదిలోగా 040-48213100 నెంబర్‌కు ఫోన్ చేసి కోవిడ్ చికిత్సపై వైద్యుల సలహాలు తీసుకోవచ్చుని సేవా భారతి ప్రతినిధులు సూచించారు.