హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వివిధ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యార్థులు రాస్తుంటారు. ఉన్నత చదువులు చదవాలంటే ప్రవేశ పరీక్షలు రాయాల్సిందే. ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తైన విద్యార్థులు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ వంటి కోర్సులను చదివేందుకు ఎప్‌సెట్, ఎడ్‌సెట్, ఐసెట్ వంటి ప్రవేశ పరీక్షలను రాస్తుంటారు. ఈ పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా సీట్ కేటాయిస్తుంటారు. అయితే ప్రవేశ పరీక్షలు రాసే విద్యార్థులకు బిగ్ షాక్ ఇచ్చింది సెట్ కమిటీ. ఇకపై 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేయనున్నట్లు వెల్లడించింది.
ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ లో నిమిషం ఆలస్యమైనా అనుమతించకూడదని నిబంధన అమల్లో ఉన్న విషయం తెలిసిందే. నిమిషం ఆలస్యం కారణంగా విద్యార్థులు పరీక్షలు రాయకుండా వెనుదిరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎగ్జామ్ టైమ్ కి 15 నిమిషాల ముందు వచ్చిన విద్యార్థులను సెంటర్ లోనికి అనుమతిస్తామని సెట్ కమిటీ స్పష్టం చేసింది. ఇకపై 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేయనున్నట్లు తెలిపింది. విద్యార్థులు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్ సెంటర్ కు ముందుగానే చేరుకోవాలని సూచించారు.