Site icon NTV Telugu

Medico Preethi: ప్రీతి ఫోన్ చాటింగ్ తో పాటు కొన్ని కీలక ఆధారాలు.. కస్టడిలో సైఫ్‌

Prethi Saif

Prethi Saif

Medico Preethi: వరంగల్ జిల్లా కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈఘటన పై సీరియస్ గా తీసుకున్న విచారణ చేపట్టారు. సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులే కారణమని ప్రాథమిక నిర్దారణ చేశారు. ఫోన్ లో చాటింగ్ తో పాటు కొన్ని కీలక ఆధారాలు పోలీసులు సేకరించారు. సైఫ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తో పాటు ర్యాగింగ్ కేసు నమోదు చేశారు. సైఫ్ ను కస్టడిలోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్నం 12:30 గంటలకు సీపీ రంగనాథ్ మీడియా ముందుకు ప్రీతి ఘటనపై మాట్లాడనున్నారు. సైఫ్ వేధింపులపై పోలీసులకు ప్రీతి తండ్రీ నరేందర్ సమాచారం ఇచ్చినా సకాలంలో స్పందించలేదనే విమర్శలు చేశారు. వరంగల్ ఏసీపి, మట్టేవాడ ఎస్.హెచ్.ఓ కు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని తండ్రి ఆరోపించారు. ఫోన్ తీయకపోవడంతో ప్రీతి తండ్రి నరేందర్ మెసేజ్ పెట్టారు. ప్రీతి ఘటనపై నలుగురు ప్రొఫెసర్లతో విచారించనున్నారు. నేడు నివేదికను సీల్డ్ కవర్ లో విచారణ కమిటీ డిఎంఈకి పంపించనున్నారు.

Read also: Ram Gopal Varma: కేటీఆర్ సార్.. మేయర్ ఇంట్లోకి వీధికుక్కలను వదలండి.. ఆర్టీవీ వీడియో వైరల్..

సైఫ్ వైద్య డిగ్రీ పట్టాను రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. ఇక డాక్టర్ ప్రీతి హెల్త్ బులిటెన్ ను నిమ్స్ ఆస్పత్రి వైద్యులు రిలీజ్ చేశారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వెల్లడించారు. డాక్టర్ ప్రీతి ఎక్మో మీదనే ఉంచామన్నారు. గుండె, కిడ్నీలలో ఫంక్షనింగ్ కొంత మెరుగుపడిందని అన్నారు. ప్రీతి శరీరం చికిత్సకు సహకరిస్తుందని తెలిపారు. ఎక్మో పెట్టాము కాబట్టి మెడిసిన్ ద్వారా నిలకడగా ఉండేలా చూస్తున్నామన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది కాని ప్రీతిని కాపాడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రత్యేక డాక్టర్ల బృందం చికిత్స అందిస్తుందని నిమ్స్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రీతి ఘటనపై రాష్ట్రం మొత్తం ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది.

https://www.youtube.com/watch?v=SZRDihoepAE

Exit mobile version