NTV Telugu Site icon

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్పీ భుజంగరావు వాగ్మూలంలో సంచలన విషయాలు

Bhujangarao

Bhujangarao

Phone Tapping Case: ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన పనులు చేసి పెట్టిన భుజంగరావు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాప్ చేసిన భుజంగరావు.. ప్రణీత్ రావు సహకారంతో ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించాడు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థికసాయం అందించే వారి ఫోన్ ట్యాప్ చేశామన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు ట్యాప్ ట్యాపింగ్ చేసి SOT, టాస్క్ ఫోర్స్ సహకారంతో ముందుకు వెళ్లామన్నారు. ప్రతిపక్ష నేతలు విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశామని అన్నారు. ప్రతిపక్ష నేతల కుటుంబసభ్యుల ఫోన్లు, వాహనాలను ట్రాక్ చేశామని తెలిపాడు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో మూడు ఉపఎన్నికల సమయంలో ట్యాపింగ్ చేశామని అన్నారు. రాజకీయ సమాచారాన్ని ప్రభాకర్రావు, శ్రవణ్ కుమార్ తో పాటు మరో ప్రైవేట్ వ్యక్తి ద్వారా తెలుసుకున్నామన్నారు.

Read also: Kalvakuntla Sanjay: వడ్ల స్కాం బయటికి వచ్చింది కాబట్టే ఫోన్ ట్యాపింగ్ లీక్ ఇచ్చారు..

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ సపోర్టర్ల ఫోన్లను ట్యాప్ చేశామని పేర్కొన్నారు. మాదాపూర్ SOT నారాయణ సపోర్ట్ ఆపరేషన్ చేశామన్నారు. అక్టోబర్ లో ఎన్నికల సంఘం రాధాకిషన్ రావుతో పాటు పలువురిని బదిలీ చేసిందన్నారు. ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్ చేశామన్నారు. సివిల్ తగాదాలను సెటిల్ చేశారని భుజంగరావు తెలిపారు. కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల పలు వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనలతో సెటిల్ చేశామన్నారు. రెండు ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి డబ్బులను పెద్దఎత్తున తరలించా ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం టాస్క్ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లామన్నారు. రియల్టర్ సంధ్యా శ్రీధర్రావును రూ.13కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనేలా చేశాం మాట వినక పోతే క్రిమినల్ కేసులతో చిత్రహింసలు పెట్టామన్నారు. కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం బీజేపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్రెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టాం హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్ల ఫోన్లను ట్యాప్ చేశామన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో కేటీఆర్ పై విమర్శలుచేసిన ప్రతిఒక్కరి ఫోన్లను ట్యాప్ చేశామన్నారు.

Farmers Suffering: విత్తనాల కోసం రైతన్న కష్టాలు.. ఆగ్రో షాపుల ముందు పడిగాపులు..

Nizamabad: స్కానింగ్ కు వచ్చే మహిళలపై వికృత చేష్టలు.. న్యూడ్ ఫోటోలతో బెదిరింపు..