V Hanumanta Rao: లోక్ సభ ఎన్నికలలో ఇండియా కూటమి గెలుస్తుందని మాజీ ఎంపీ విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ని దేవుడు పంపిన దేవదూత అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అంటూన్నాడన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మోడీ కన్యకుమారి లో ధ్యానం చేస్తాననంటున్నాడని తెలిపారు. మతాలనే విడదీసే మోడీకి మూడు రోజుల ధ్యానం ఎందుకు? అని ప్రశ్నించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న మోడీ రైతులు నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఐటీ ఐఐఎం రిజరేషన్లు తెచ్చింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా కుల గణన చేపడుతుందన్నారు. లోక్ సభ ఎన్నికలలో ఇండియా కూటమి గెలుస్తుందన్నారు.
Read also: Telangana: తెలంగాణ కొత్త లోగో ఆవిష్కరణ లేనట్టే..? ఎందుకంటే..?
రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని తెలిపారు. ఇక తాజాగా నయీమ్ డైరీ ఎక్కడికి పోయిందని వీహెచ్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. అయితే.. బ్రిటీష్ కాలంలో తెచ్చిన చట్టాల్లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. రాహుల్ గాంధీ ప్రధాని అయితే పాత చట్టాలను మారుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక… జ్యూడీషియల్ రిమాండ్‌ను 14 రోజుల కంటే ఎక్కువ పెంచాలని అన్నారు. అయితే.. నల్సార్ వర్సిటీ వీసీ సూచించిన చట్టాలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక, లిక్కర్ కేసులోనూ ఇంతవరకు పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు.
Balakrishana : బాలయ్య, విశ్వక్ సేన్ కాంబినేషన్ లో వెబ్ సిరీస్..?
