MLC Kavitha: బీజేపీతో కుదిరిన అవగాహన వల్లే సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులు ఏడాది కాలంగా ముందుకు సాగడం లేదని బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు ఏమైంది? కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న అవగాహనను బయటపెట్టాలని కవిత డిమాండ్ చేశారు. సీడబ్ల్యూసీ సమావేశాలకు వచ్చే రాజకీయ పర్యాటకులకు స్వాగతం పలుకుతూ కవిత ప్రసంగించారు. హైదరాబాద్ బిర్యానీ తిని సంతోషంగా వెళ్లండి అంటూ ఎమ్మెల్సీ కవిత అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌లపై ఏడాదిన్నరగా ఈడీ దర్యాప్తు ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. ఏడాదిన్నర క్రితమే సోనియా, రాహుల్, ఖర్గే, పవన్ బన్సల్, తెలుగు రాష్ట్రాల నేతలను ఈడీ ప్రశ్నించిందని.. ఆ తర్వాత ఏం జరిగింది? బీజేపీతో అవగాహన వల్లే కాంగ్రెస్ నేతలను ఈడీ విచారణకు పిలవడం లేదా..? అంటూ కవిత ప్రశ్నించారు.
Read also: Sweet Corn: శవాలను కాల్చేసిన బొగ్గులతో మొక్కజొన్న పొత్తులు కాలుస్తున్నారా ?
కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న అవగాహనను బయటపెట్టాలని కవిత డిమాండ్ చేశారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానంతో కాంగ్రెస్ పార్టీ బహుళ వైఖరి అవలంభిస్తోందని కవిత మండిపడ్డారు. ఒక రాష్ట్రంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని, మరో రాష్ట్రంలో అదే పార్టీలను వ్యతిరేకిస్తున్నారని దుయ్య బట్టారు. ఒక ప్రాంతంలో ఆప్ తో పోరాడుతూనే మరో ప్రాంతంలో అదే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లు అదానీకి రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికాయని, అయితే ఇతర రాష్ట్రాల్లో మాత్రం వ్యతిరేకిస్తున్నాయని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ మోసపూరిత, ద్వంద్వ విధానాలను ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. దయచేసి ఈ రాజకీయ గందరగోళం వంటి అంశాలపై ఈ దేశానికి స్పష్టత ఇవ్వండి అన్నారు. మీరు ప్రజల నుండి ఏమి ఆశిస్తున్నారు? BRS మొదటి రోజు నుండి స్పష్టంగా ఉంది. మేము కాంగ్రెస్, BJP రెండింటికీ వ్యతిరేకమన్నారు. అందుకే మేము ఏ కూటమిలోనూ భాగం కాదని స్పష్టం చేశారు. కానీ ఏమిటి కాంగ్రెస్ స్టాండ్ ఇదేనా? అని ప్రశ్నించారు.
NavIC: ఐఫోన్15లో NavIC టెక్నాలజీ.. ఈ ఇస్రో టెక్నాలజీ ఏంటో తెలుసా..?