Raja Singh: తెలంగాణ బీజేపీ అధిష్టానం తీరుతో విసిగిపోయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలుగుదేశంలో చేరే అవకాశాలు ఉన్నాయనే వార్తలు సంచలనంగా మారాయి. అయితే రాజా సింగ్ బీజేపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు ఇటీవల వస్తున్న వదంతులపై శనివారం ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు. తాను టీడీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని రాజాసింగ్ కొట్టిపారేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీజేపీ నుండే గోషామహల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నా మెంటాలిటీ కి బీజేపీ తప్ప ఏ పార్టీ లు షూట్ కావు… ఎవరు తీసుకోరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోకి వెళ్ళలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. నా మీద సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తెస్తారో తెలియదన్నారు. బండి సంజయ్, కేంద్ర మంత్రులు ,బీజేపీ నేతలు నా వెనుక ఉన్నారని రాజాసింగ్ తెలిపారు.
Read also: Rains In Hyderabad: నదుల్లా రోడ్లు.. భారీ వర్షానికి నీట మునిగిన భాగ్యనగరం..
స్టాండ్-అప్ కామెడీ షోకు వ్యతిరేకంగా, రాజాసింగ్… ప్రవక్తపై అవమానకరమైన వ్యాఖ్యలను కలిగి ఉన్న వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో పోలీసులు అతడిపై పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు తరలించారు. రాజా సింగ్‌ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆరు నెలలకు పైగా దాటింది. బీజేపీ నాయకత్వం తనపై నిషేధాన్ని ఎత్తివేస్తుందని రాజా సింగ్ ఎక్కడో ఆశించారు కానీ అది జరగలేదు. ఏకంగా టీ-బీజేపీ నాయకత్వంతో, బండి సంజయ్‌తో విభేదాలు వచ్చాయి. వీటన్నింటితో కలత చెందిన రాజా సింగ్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని వార్తలు సంచలనంగా మారాయి.
రాజా సింగ్ తన తొలినాళ్లలో తనకు రాజకీయ అవకాశం కల్పించిన తెలుగుదేశం వైపు చూశారు. 2009 నుంచి 2014 వరకు టీడీపీ కార్పొరేటర్‌గా ఉన్న రాజాసింగ్ 2014లో బీజేపీలో చేరి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో బీజేపీ నుంచి తెలంగాణ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. విధేయులు మారడం కోసం, రెండు రోజుల క్రితం, రాజా సింగ్ తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్‌తో సమావేశమై అవకాశాలపై చర్చించినట్లు వార్తలు వచ్చాయి. ఘోషామహల్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ సాధించాలనే తపనతో తన నియోజకవర్గం టిక్కెట్‌ను కోరినట్లు, దీంతో పాటు కనీసం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనైనా టీడీపీ గెలుపు బాధ్యతను తానే తీసుకుంటానని రాజాసింగ్ హామీ ఇచ్చినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఓ కీలక నేత చర్చలు జరిపారని, పరిస్థితులు కుదిరితే వచ్చే వారం రాజాసింగ్ టీడీపీలో చేరే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే శనివారం రాజాసింగ్ మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చారు.
Nora Fatehi: నోరా నువ్వు డ్రస్ వేసుకున్నావా? అలా చూపిస్తే ఎలా?