NTV Telugu Site icon

KTR: ఇది చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం.

Ktr

Ktr

KTR: ఇది చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తను ఎక్కడికి వెళ్ళను, రాజకీయ జన్మను ఇచ్చిన సిరిసిల్ల ప్రజలతోనే ఉంటానని తెలిపారు. 24 సంవత్సరాలు పని చేసిన కారుకు, చిన్న సర్వీసింగ్ అవసరం పడదా ? అని ప్రశ్నించారు. ఇది చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని తెలిపారు. పద్నాలుగు నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయామన్నారు. అధికార పార్టీ కంటే కేవలం 1.8 శాతం ఓట్లు మాత్రమే థక్కువ వచ్చాయని అన్నారు. వాళ్ళు 420 హామీలు ఇచ్చి 1.8 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చారన్నారు. రైతులు రైతు బందు కోసం ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటున్నారని అన్నారు. ఆరున్నర రక్షల మంది ఆటో డ్రైవర్లు రొడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఫ్రీ బస్సుల కోసం మహిళలు పడుతున్న అవస్థలు చూస్తూనే ఉన్నామని అన్నారు.

బస్సులు పెంచండి, రోడ్డు న పడుతున్న ఆటో డ్రైవర్ లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీ ల పేరుతో పదమూడు హామీలు ఇచ్చారని అన్నారు. మాకు తెలంగాణా ముఖ్యం కాబట్టి, తప్పకుండా ప్రజల పక్షాన ముందుంటామని అన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడంలో కెసిఆర్ ను మించిన నాయకుడు దేశంలో లేడని అన్నారు. మూడు ఫీట్లు కూడా లేనాయన, బిఆర్ఎస్ ను వంద మీటర్ల లోతులో పాతరపెడతాడట అంటూ మండిపడ్డారు. మంచి, మంచి తీస్మార్ ఖాన్ లే కేసిఆర్ ను ఏం చేయలేకపోయారు, ఈ బుడ్డర్ ఖాన్ తో ఏమైతది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాణిక్యం ఠాగూర్ కు యాబై కోట్లు ఇచ్చి , మేనేజ్మెంట్ కోటాలో ముఖ్యమంత్రివి ఆయ్యావని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల నుండి తప్పించుకోకుండా చూడాలన్నారు. అవినీతి జరిగితే, ప్రభుత్వం నీ చేతిలో ఉంది, ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకో అన్నారు. రైతు భరోసా ఇచ్చినట్లు ముఖ్యమంత్రి బోగస్ మాటలు చెబుతున్నారని అన్నారు. వచ్చే పంట వరకు రైతు భరోసా ఇవ్వకుంటే, పార్టీ ని చీల్చి చెండాడుతారని అన్నారు. రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ కింద లంకె బిందెలు ఉంటయని అనుకున్నడని అన్నారు.

Read also: Health Benefits: ఈ సమస్యలు వున్నవారు ఎర్ర బియ్యం తింటే..

సాద్యం కాని హామీలు ఇచ్చారని తెలిపారు. సిరిసిల్ల నేతన్నలకు నేను మాట ఇస్తున్నా, 39 ఎమ్మెల్యేలు కలిసి ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తం, మీకోసం ముందుంటానని అన్నారు. ఎవరులేని నాడే తెలంగాణా తెచ్చింది మనమే.. పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ కాదన్నారు. ప్రజల పక్షాన ఐదేండ్లు నిలబడి కొట్లాడుదామన్నారు. ఒకరిద్దరు పోయినా పర్వాలేదు, మళ్ళీ కొత్తవారిని తయారు చేసుకుందామని తెలిపారు. మెజారిటీ ఎందుకు తగ్గిందో చర్చించి, లోపాలను మార్చుకుందామని తెలిపారు. ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్స్ ఉన్నాయి, మీ కోసం మీకంటే ఎక్కువ కష్టపడుతామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేలా, వెంట పడాలని కార్యకర్తలకు సూచన అన్నారు. వినోద్ కుమార్, బండి సంజయ్ ల పనితీరును పోల్చుకొండని, బండి సంజయ్ ఇప్పటి వరకు తిరగని మండలాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. ఒక్క బడి కాని, ఒక్క గుడి కాని బండి సంజయ్ మనకు తేలేదని కేటీఆర్ అన్నారు.

అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప చేసిందేమి లేదని, ధర్మం కోసం పని చేస్తా అంటే, మఠం పెట్టుకోవాలన్నారు. ప్రజల కోసం పనిచేయకుంటే, ఓటు అడిగే హక్కు సంజయ్ కు లేదని అన్నారు. దేవుడు పేరు మీద ఓట్లు అడగడం కాదు సంజయ్, యాదగిరి గుట్ట కట్టింది మేమే అన్నారు. ధర్మం మీద పని చేసేది ఉంటే రాజకీయం మానుకొండి సంజయ్ అన్నారు. ఈ రోజు ఇండియా కూటమిలో ఎవరున్నారు, ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారని తెలిపారు. భారత్ జోడో అని రాహుల్ అంటుంటే, కాంగ్రెస్ చోడో అని ప్రజలు అంటున్నారని అన్నారు. మోడీని ఆపె సత్తా కాంగ్రెస్ కు లేదు, ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్, బిజేపి మద్య ఉన్న సంబంధం వల్లే రెండు ఎమ్మెల్సీలు వాళ్ళకు పోయాయని అన్నారు. దాసోజు శ్రవణ్ ను ఆంగీకరించని గవర్నర్, కోదండరాంను అంగీకరించారన్నారు. వీరిద్దరి మధ్య అనైతిక ఒప్పందాన్ని ప్రజలకు వివరించాలన్నారు.
Sangareddy District: మరిదిపై కారం చెల్లిన వదిన.. తమ్ముడిని గొడ్డలితో నరికిన అన్న